హరికృష్ణ విషాదం జరగకుండా ఉంటే...

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 4, Sep 2018, 9:59 AM IST
chandrababu coments on hari krishna death
Highlights

టీవల హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలై మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా.. మంత్రి వర్గ విస్తరణ గురించి మీడియా చంద్రబాబు వద్ద ప్రస్తావించగా.. ఈవిధంగా స్పందించారు.

సినీనటుడు, టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ విషాదం జరగకుండా ఉండి ఉంటే.. ఇప్పటికే ఏపీలో మంత్రి వర్గ విస్తరణ పూర్తయ్యి ఉండేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇటీవల హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలై మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా.. మంత్రి వర్గ విస్తరణ గురించి మీడియా చంద్రబాబు వద్ద ప్రస్తావించగా.. పైవిధంగా స్పందించారు.

తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించగా.. సరైన సమయంలో సరైన నిర్ణయం వెల్లడిస్తామన్నారు. రెండు పార్టీలు మీతో పొత్తుకు సిద్ధపడుతున్నాయట కదా అని ప్రశ్నించగా మీకు ఎవరు చెప్పారు? అంటూ నవ్వుతూ ఎదురు ప్రశ్నించారు. హైకోర్టు విభజనకు సంబంధించిన అంశంలో అఫిడవిట్‌ దాఖలు చేస్తామన్నారు. హైకోర్టు అక్కడ ఉండాల్సిన అవసరం లేదన్నదే ప్రభుత్వ విధానమని చెప్పారు. డిసెంబరుకల్లా హైకోర్టు భవన నిర్మాణం పూర్తవుతుందని వివరించారు.

loader