టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడికి భద్రతను పెంచారు. ఎన్‌ఎస్ జీ కమెండోల సంఖ్య ను 12+12కి పెంచారు.  ప్రస్తుతం 6+6 ఎన్‌ఎస్ జీ కమెండోలు చంద్రబాబు భద్రతను  పర్యవేక్షిస్తున్నారు. 

చిత్తూరు: నిన్న కుప్పంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో టీడీపీ చీఫ్ చంద్రబాబుకు భద్రతను కేంద్రం పెంచింది. ప్రస్తుతం ఉన్న భద్రతను రెట్టింపు చేసింది. 12+12 ఎన్ ఎస్ జీ కమెండోలతో భద్రతను పెంచారు. ప్రస్తుతం 6+6 ఎన్ ఎస్ జీ కమెండోలు చంద్రబాబుకు భద్రతను పర్యవేక్షించేవారు. అయితే కుప్పంలో రెండు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో చంద్రబాబుకు భద్రతను పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. 12+12 ఎన్ఎస్‌జీ కమెండోలతో భద్రతను పెంచారు. చంద్రబాబుకు భద్రతను పెంచుతూ ఎన్ఎస్‌జీ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని, అమరావతిలోని పార్టీ కార్యాలయాన్ని ఎన్ఎస్‌జీ డీజీ నిన్ననే పరిశీలించారు. కుప్పం టూర్ లో ఉన్న చంద్రబాబుకు భద్రతను కూడా పెంచారు.