Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3,220 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ శ్రీకారం చుట్టింది.

Notification issued to fill 3220 faculty posts in universities ksm
Author
First Published Oct 31, 2023, 3:33 PM IST | Last Updated Oct 31, 2023, 3:33 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న 3,220 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. 418 ప్రొఫెసర్, 801 అసోసియేట్ ప్రొఫెసర్, 2,001 అసిస్టెంట్ ప్రొఫెసర్ (రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం 220 లెక్చరర్ పోస్టులతో కలిపి) పోస్టులను భర్తీ చేయనున్నట్టుగా తెలిపింది. 

ఇందుకు సంబంధించి ఉన్నత విద్యామండలి ఉమ్మడి పోర్టల్‌లో నేటి (మంగళవారం) నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో అప్లికేషన్ పెట్టాల్సిన పరిస్థితి ఉండటంతో ప్రవేశ రుసుముకు ఎక్కువ ఖర్చయ్యేది. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులన్నింటికీ కలిపి ఒకే అప్లికేషన్, ఒకటే ఫీజు ఉంటుంది. 

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల ఓపెన్‌ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు, రూ.2,500,  ఎస్సీ, ఎస్టీ, పీబీడీలు అభ్యర్థులు రూ.2 వేలు, ఎన్నారైలుకు 50 డాలర్లు , ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు అన్ని కేటగిరీల అభ్యర్థులకు.. రూ.3 వేలు, ఎన్నారైలకు ప్రొఫెసర్‌ పోస్టులు: 150 డాలర్లు (రూ.12,600),అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు: 100 డాలర్లు (రూ.8,400) చెల్లించాల్సి ఉంటుంది. 

అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో నవంబర్ 20 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కాపీని ఉన్నత విద్యామండలికి పోస్ట్ ద్వారా 27 వ తేదీలోపు పంపించాలి. ఇక, అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా పారదర్శకంగా జరపనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి గరిష్టంగా 10 మార్కుల వెయిటేజ్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టు స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలను నవంబర్ 30 ప్రకటించి, డిసెంబర్ 8న అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios