చుక్కల మందు ప్రమాదకరమే: హైకోర్టుకు ల్యాబ్ ల నివేదిక
ఆనందయ్య చుక్కల మందు హనికరమని నివేదికలు చెబుతున్నాయని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
ఆనందయ్య చుక్కల మందుపై ఏపీ హైకోర్టులో గురువారం నాడు విచారణ జరిగింది. ఈ విచారణలో చుక్కల మందుపై ల్యాబ్ రిపోర్టులను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది.
అమరావతి: ఆనందయ్య చుక్కల మందు హనికరమని నివేదికలు చెబుతున్నాయని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.ఆనందయ్య చుక్కల మందుపై ఏపీ హైకోర్టులో గురువారం నాడు విచారణ జరిగింది. ఈ విచారణలో చుక్కల మందుపై ల్యాబ్ రిపోర్టులను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది.
15 ల్యాబ్ రిపోర్టులు చుక్కల మందు నాట్ గుడ్ అంటూ సర్టిఫికెట్ ఇచ్చాయని ప్రభుత్వం తెలిపింది. నిర్ధిష్ట ప్రమాణాలతో చుక్కల మందు లేవని ఈ రిపోర్టులు చెబుతున్నాయని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.ప్రభుత్వం సమర్పించిన నివేదికపై వాదనలు విన్పించేందుకు సమయం కావాలని ఆనందయ్య న్యాయవాది కోరాడు.ఈ పిటిషన్ పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
also read:తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఆనందయ్య మందు పంపిణీ
చుక్కల మందు మినహా ఇతర మందులను పంపిణీ చేసేందుకు ఆనందయ్యకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ విషయమై తనకు అనుమతి ఇవ్వాలని ఆనందయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆనందయ్య మందును ఆన్ లైన్ లో సరఫరా చేస్తున్నార. అయితే చుక్కల మందుతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగలేదని ఆనందయ్య గతంలో ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన హైకోర్టు దృష్టికి కూడ తీసుకొచ్చే అవకాశం లేకపోలేదు.