Asianet News TeluguAsianet News Telugu

తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఆనందయ్య మందు పంపిణీ

తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ ఆధ్వర్యంలో 4 సెక్టార్స్ ప్రొడ్యూసర్స్, మెంబర్స్, స్టాఫ్‌, మీడియాకి ఆనందయ్య మందు పంపిణి చేశారు.

anandayya medicine distributed through telugu film chamber  arj
Author
Hyderabad, First Published Jun 23, 2021, 4:56 PM IST

తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ ఆధ్వర్యంలో 4 సెక్టార్స్ ప్రొడ్యూసర్స్, మెంబర్స్, స్టాఫ్‌, మీడియాకి ఆనందయ్య మందు పంపిణి చేశారు. దీనికి తెలుగుఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి కె.ఎల్.దమోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్  ఏలూరు సురేందర్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ ఇసనాకా సునీల్ రెడ్డి, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఆధ్వర్యంలో ఆనందయ్య మందు పంపిణీ జరిగింది. 

ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మెంబర్ నిర్మాత సునీల్  రెడ్డి మాట్లాడుతూ, `మాది నెల్లూరు కావడమే కాక ఆనందయ్యతో నాకు మంచి పరిచయం ఉండడంతో ఫిల్మ్ ఛాంబర్ 4  సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్, స్టాఫ్ తో పాటు మీడియా మిత్రులందరికీ ఆనందయ్య మందు పంపిణీ లాంటిది చేస్తే బాగుంటుందని కొంతమంది నిర్మాతలు తెలపడంతో వారు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతల కోరిక మేరకు ఈ ఆనందయ్య మందును అందిస్తున్నాము. ఈ మందును  ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు ఒక బఠాని గింజంత వేసుకోవాలి. రాత్రి భోజనం చేసే ముందు ఒక బఠాని గింజంత వేసుకోవాలి. 

ఒక రెండు రోజుల వరకు కూడా గుడ్డు, నాన్వెజ్ , ఆల్కహాల్ వంటివి తీసుకోకూడదు. ఇది కరోనా రాని వాళ్లకు మాత్రమే. కరోనా వచ్చి పోయిన వారు కూడా ఈ మందు వేసుకోవచ్చు. కరోనాతో బాధ పడుతున్న వారు మాత్రం ఈ మందు వాడకూడదు. వ్యాక్సిన్ వేసుకున్న వారు మాత్రం వారం తర్వాత ఈ మందు వేసుకోవచ్చు. ఈ మందు వలన ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. ఆనందయ్యతో  నాకున్న పరిచయంతో ఆయనను రిక్వెస్ట్ చేసుకొని ఆనందయ్య గారి చేతుల మీదుగా మందు తయారు చేసుకొని తీసుకు రావడం జరిగింది. సుమారు  500 మంది నుంచి 700 మంది వరకు ఈ మందు సరఫరా చేస్తున్నాం. ఇండస్ట్రీ అంతా ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో నా వంతు ఇలాంటి మంచు కార్యక్రమం చేస్తున్నాన`ని అన్నారు.

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి  దామోదరప్రసాద్‌ మాట్లాడుతూ, `నాకు రెండు రోజుల క్రితం సునీల్ రెడ్డి ఫోన్ చేసి సినిమా ఇండస్ట్రీ ఆరోగ్యంగా ఉండాలనే తలంపుతో ఆనందయ్య మందు తీసుకు వచ్చి అందరికీ పంపిణీ కార్యక్రమం చేయాలనుకుంటున్నానని చెప్పారు. ఈ కవర్ లో దానికి సంబంధించిన ఒక పాంప్లెట్ ఉంది. ఆ పాంప్లెట్ ని ఫాలో అయి మీరందరూ వాడతారని ఆశిస్తున్నాను. దీనికి సంబంధించిన ఫిలిం ఛాంబర్ 4 సెక్టార్స్ ప్రొడ్యూసర్స్ & మెంబెర్స్, స్టాఫ్ కు  మరియు  మీడియా మిత్రులందరికీ అందజేస్తున్నాం. ఈ మందు కోసం అందరూ తమ ఐడీ కార్డు చూపించి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం` అని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios