Asianet News TeluguAsianet News Telugu

లండన్ చుట్టు తిరిగి నారాయణ సాధించిందేమిటి?

  • రాజధాని నిర్మాణాలకు సంబంధించి డిజైన్లకు సూచనలు ఇవ్వటానికి రాజమౌళి బృందం లండన్ లో దిగింది.
  • అమరావతి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను బ్రిటన్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
  • ఆ నార్మన్ ఫోస్టర్ కు సలహాలు, సూచనలు ఇవ్వటానికే రాజమౌళి లండన్ కు చేరుకున్నారు.
  • వినటానికే విచిత్రంగా ఉన్నా అంతర్జాతీయ ఆర్కిటెక్టుకు ఓ సినిమా దర్శకుడు సలహాలివ్వటమేంటని ప్రతిపక్షాలు నిలదీసినా చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు.
Nobody knows how rajamouli would improve norman foster designs of Amaravati

రాజధాని నిర్మాణాలకు సంబంధించి డిజైన్లకు సూచనలు ఇవ్వటానికి రాజమౌళి బృందం లండన్ లో దిగింది. అమరావతి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను బ్రిటన్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ నార్మన్ ఫోస్టర్ కు సలహాలు, సూచనలు ఇవ్వటానికే రాజమౌళి లండన్ కు చేరుకున్నారు. వినటానికే విచిత్రంగా ఉన్నా అంతర్జాతీయ ఆర్కిటెక్టుకు ఓ సినిమా దర్శకుడు సలహాలివ్వటమేంటని ప్రతిపక్షాలు నిలదీసినా చంద్రబాబునాయుడు పట్టించుకోలేదు.

ఇక్కడ పాయింటేమిటంటే, ఒక్కసారికే రాజమౌళి నార్మన్ ఫోస్టర్ కు సలహాలు, సూచనలు ఇవ్వగలిగినపుడు నారాయణ, సిఆర్డీఏ ఉన్నతాధికారులు ఇంతకాలం ఏం చేసినట్లు? డిజైన్లపై సంప్రదింపుల పేరుతోనే కదా నారాయణైనా సిఆర్డీఏ ఉన్నతాధికారులైనా లండన్-అమరావతి మధ్య చక్కర్లు కొడుతున్నది. దాదాపు ఏడాది కాలంలో వీరు తిరిగిందానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయిందో? అదంతా ప్రజాధనమే కదా? వారి జేబులో నుండి పెట్టుకున్నది ఎంతమాత్రం కాదు.

అమరావతి, లండన్ మధ్య ఇంతకాలం ఎందుకు తిరిగారో వారే చెప్పాలి? అంటే వారు తిరిగింది డిజైన్ల కోసం కాదా? అన్న అనుమానం వస్తోంది అందరికీ. వాళ్ళు తిరిగింది నిజంగా డిజైన్ల కోసమే అయితే, ఫలితం కనబడాలి కదా? ఇంతకాలం నార్మాన్ ఫోస్టర్ రూపొందించిన డిజైన్లేవీ చంద్రబాబును ఆకట్టుకోలేదు కదా? అంటే వారు తిరగటం వల్ల ప్రజాధనం వృధా అయిపోయిందన్న విషయం అర్ధమైపోతోంది. మరి తాజా పర్యటనలో రాజమౌళి వల్ల అమరావతికి ఏం ఉపయోగమో చూడాలి?

Follow Us:
Download App:
  • android
  • ios