ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా చిన్నకోడలు అనుమానాదాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. కన్నా లక్ష్మీనారాయణ చిన్న కోడలు సుహారిక మృతి ఆత్మహత్యమాత్రం కాదు అని పోలీసులు తేల్చేశారు. మరిన్ని వివరాలు పోస్ట్ మార్టం రిపోర్టు వెలువడ్డాక తెలుస్తాయని పోలీసులు అంటున్నారు. 

వివరాల్లోకి వెళితే.. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనాక్షి టవర్స్‌లో గురువారం సాయంత్రం సుహారిక ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.

ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే సుహారిక మరణించినట్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆమె మీనాక్షి బాంబూస్ కి ఒక చిన్న పార్టీకి అటెండ్ అవ్వడానికి వెళ్లినట్టు తెలియవస్తుంది. ఆమె పవన్ రెడ్డి అనే మిత్రుడి ఇంటికి వెళ్లినట్టు తెలియవస్తుంది. ఈ సంఘటన జరిగినప్పుడు మరణించిన సుహారిక సోదరి భర్త ప్రవీణ్ అక్కడే ఉన్నట్టు తెలియవస్తుంది. 

ఆమె శవాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. రేపు ఉద్యమ ఆ శవానికి పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఆ తరువాత మాత్రమే ఈ మరణం వెనకున్న అన్ని కారణాలు తెలియవస్తాయని పోలీసులు అంటున్నారు.  

కాగా సుహారిక మృతికి గల కారణాలు తెలియాల్సి వుంది. ఆమె ఆకస్మిక మరణంతో కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

వారిరువురు కలిసి భాగస్వామ్యంలో ఇరువురి పేర్లు కలిసొచ్చేలా సునీన్ద్ర ఎంటర్ ప్రైజస్ అనే సంస్థను నెలకొల్పారు.