వరి ధాన్యం కొనుగోలు వివాదం: తెలంగాణపై కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

వరి ధాన్యం కొనుగోలును మరింత వేగవంతం చేస్తామని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి  కొడాలి నాని తెలిపారు. తెలంగాణ తరహలోనే తమకు ఇబ్బందులున్నా  కూడా రాష్ట్రంలో రైతులకు ఏ పంట వేయాలో పూర్తి స్వేచ్చ ఇచ్చినట్టుగా ఆయన చెప్పారు.

No restrictions on crop production in Ap Sated  Says  minister Kodali  Nani

అమరావతి:తెలంగాణ రాష్ట్రం తరహలోనే తమ రాష్ట్రంలో కూడా ఇబ్బందులున్నా రైతులకు ఏ పంట వేసుకోవాలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని  ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రకటించారు.సోమవారం నాడు తాడేపల్లిలో  ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి Kodali Nani మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టుగా మంత్రి చెప్పారు.  ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం  Ys Jagan జగన్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇవాళ్టి నుండి ధాన్యం కొనుగోలును మరింత వేగవంతం చేస్తామని ఆయన ప్రకటించారు.ప్రతి గింజ వరి ధాన్యం కొనుగోలు  చేస్తామన్నారు. Telangana లో ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఉందన్నారు. ఈ విషయాన్ని మంత్రి  గుర్తు చేశారు. 

పవన్ కళ్యాణ్ పై మంత్రి నాని సెటైర్లు

Jana sena చీఫ్ Pawan kalyan పై  మంత్రి నాని సెటైర్లు వేశారు. పార్లమెంట్ లో ప్ల కార్డులు పట్టుకొంటే  Visakha steel plant ప్రైవేటీకరణను కేంద్రం ఆపేస్తోందా అని ఆయన ప్రశ్నించారు.ప్ల కార్డులు పట్టుకొంటే  ప్రైవేటీకరణ ఆగిపోతోందని హమీ ఇస్తే తమ పార్టీ ఎంపీల చొక్కాలపైనే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు రాయిస్తామన్నారు మంత్రి నాని.తమ పార్టీ  వ్యూహాకర్త prashant kishor  అని  మంత్రి గుర్తు చేశారు.  కానీ  ప్రశాంత్ కిషోర్ (పీకే) గా  భావించి  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తమకు సలహాలు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

also read:AP politics Roundup 2021: చంద్రబాబుకు కొడాలితో చెక్, నాని విమర్శలకు కౌంటర్ ఇవ్వలేని టీడీపీ

పవన్ కళ్యాణ్ తమ పార్టీకి ఏమైనా సలహాదారుడా అని ఆయన ప్రశ్నించారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీ, అమిత్ షా, స్థానిక బీజేపీ నేతల మనసు కష్టపడకుండా ఏం చేయాలో అది చేసుకోవాలని  మంత్రి పవన్ కళ్యాణ్ కు సలహా ఇచ్చారు.  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికో నిర్ణయం తీసుకొంటారా అని ప్రశ్నించారు. తమ పార్టీకి పవన్ కళ్యాణ్ ను సలహాదారుగా పెట్టుకొంటే  తాము బయటకు వెళ్లడం ఖాయమన్నారు. మా పీకే (ప్రశాంత్ కిషోర్ ) మాకున్నాడని మంత్రి నాని చెప్పారు. 

చంద్రబాబుపై మంత్రి నాని ఫైర్

చంద్రబాబుకు కుట్రలు పన్నడం వెన్నతో పెట్టిన విద్య అని మంత్రి చెప్పారు. ఎవరి పాపాన వాళ్లే పోతారన్నారు. భార్యను అడ్డం పెట్టుకొని ఎవరైనా రాజకీయాలు చేస్తారా అని కొడాలి నాని చంద్రబాబును ప్రశ్నించారు. ఆడవాళ్ల ఉసురు తగిలి చంద్రబాబు సర్వనాశనం అవుతారన్నారు. చంద్రబాబుకు కుట్రలు పుట్టుకతోనే వచ్చాయన్నారు. చంద్రబాబు చెబుతున్న మాటలు నిజమని నిరూపిస్తే తాను రాజకీయాల నుండి వైదొలుగుతానని మంత్రి ప్రకటించారు. హైద్రాబాద్ లో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు లను తానే కట్టించానని చంద్రబాబు చేసే ప్రకటనలను ఆయన ప్రస్తావించారు. వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్దిని చంద్రబాబు తన హయంలో జరిగిన అభివృద్దిగా చెప్పుకొంటున్నాడని మంత్రి నాని విమర్శించారు.చంద్రబాబు చెప్పే మాటలపై చర్చకు తాను సిద్దంగా ఉన్నానని చెప్పారు. చంద్రబాబు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని మంత్రి నాని చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios