జైల్లో చంద్రబాబు : అరకొరవసతులు..దోమ కాట్లు, చన్నీళ్ల స్నానాలు...
చంద్రబాబు నాయుడికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వసతులు సరిగా లేవని సమాచారం. దోమలతో ఇబ్బంది పడుతున్నారని, చన్నీళ్లతో స్నానం చేస్తున్నారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడుని ఆయన భార్య భువనేశ్వరి బుధవారం నాడు ములాఖత్ లో కలిశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జైల్లో విపరీతమైన దోమలు ఉన్నాయని.. చంద్రబాబును బంధించిన బ్యారేజ్ చుట్టూ దట్టమైన చెట్లు ఉండడంతో దోమలు విపరీతంగా ఉన్నాయని అన్నారు.
రోజు మొత్తం దోమకాట్లతోనే గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు స్నానం చేయడానికి చన్నీళ్లనే ఇస్తున్నారని బాధపడ్డారు. మామూలుగా 60 ఏళ్లు దాటిన ఖైదీలకు సాధారణ కారాగారంలో విధిగా స్నానానికి వేడినీల్లు ఇవ్వాలని నిబంధన ఉంది. కానీ దీనికి విరుద్ధంగా చంద్రబాబుకు చల్లనీళ్లు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రత పెంపు... పవన్, బాలకృష్ణ ములాఖత్ ఎఫెక్ట్...
భువనేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రానికి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ఉమ్మడి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి.. ప్రస్తుత ప్రతిపక్ష నేతకి కారాగారంలో కేటగిరి1 కింద ప్రత్యేక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. కానీ అవేమీ అక్కడ కనిపించలేదన్నారు. 74 ఏళ్ల వయసులో వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను ఈ తీరుగా హింసిస్తున్నారు.
గది శుభ్రంగా లేదని, చంద్రబాబు కేటాయించిన మంచం కుర్చీలు కూడా అణువుగా లేవని సమాచారం. బాబు నాయుడు కి ఒక ఫ్యాన్, ఒక బెడ్ మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జైల్లో ఉన్నా చంద్రబాబుకు నిత్యం వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ భద్రతపై అనుమానాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు వైద్యులతో పరీక్షలు చేయించుకోవడానికి విముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం.
బుధవారం సాయంత్రం చంద్రబాబు నాయుడుకి పరీక్షలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. టిడిపి నుంచి అనుమానాలు వ్యక్తం అవుతున్నా.. జైలులో కట్టుదిట్టమైన భద్రత ఉందని మాత్రమే అధికారులు చెబుతున్నారు కానీ వారి అనుమానాలపై స్పష్టత ఇవ్వడం లేదు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఏ అధికారిక సమాచారం గురించి అయినా ఫోన్ చేస్తే…‘ప్లీజ్ అర్థం చేసుకోండి ఇప్పుడే మాట్లాడలేం.. మాట్లాడలేం పరిస్థితి చాలా సెన్సిటివ్గా ఉంది’ అని అధికారులు చెబుతున్నారు. జైలు అధికారులు మీడియాతో మాట్లాడడానికే భయపడుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వపెద్దలనుంచి చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో స్పష్టమైన హెచ్చరికలు ఉన్నాయి.