సారాంశం
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును నేడు లోకేష్, పవన్, బాలకృష్ణ కలవనున్నారు. ఈ నేపథ్యంలో జైలు దగ్గర 300 మంది పోలీసులతో భద్రతను పెంచారు.
రాజమండ్రి : చంద్రబాబునాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. నేడు జైలులో ఉన్న చంద్రబాబును కలవడానికి బాలకృష్ణ, పవన్ కల్యాణ్, నారా లోకేష్ లు వెళ్లనున్నారు. ఉదయం 11.30 గం.ల సమయంలో కలవనున్నారు. చంద్రబాబుతో ములాఖాత్ అనంతరం వీరు జైలు బయటే మీడియాతో మాట్లాడనున్నారు.
ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచింది రాష్ట్రప్రభుత్వం. పవన్ కల్యాణ్, బాలకృష్ణ వస్తుండడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులతో బందోబస్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్ట్స్ కాలేజ్ వద్ద వాహనాల దారి మళ్లింపుచేశారు. ఎయిర్పోర్ట్ నుండి సెంట్రల్ జైలు వరకు పోలీసుల పికెటింగ్ ఏర్పాటు చేశారు.
మీడియా సమావేశం అనంతరం భువనేశ్వరిని కలిసి పవన్ కల్యాణ్ పరామర్శిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.