Asianet News TeluguAsianet News Telugu

2019లో ఒంటరిపోరే, బాబు అవినీతిపై ఫిర్యాదు చేస్తాం: బొత్స

బాబుపై బొత్స సత్యనారాయణ హట్ కామెంట్స్

No alliance with any party in 2019 elections says ysrcp leader Bosta Satyanarayana

హైదరాబాద్:  2019 ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తోందని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.బిజెపి, కాంగ్రెస్, జనసేనతో కూడ ఎలాంటి పొత్తులు ఉండవని  ఆయన తేల్చి చెప్పారు. పీఎసీ చైర్మెన్  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లిలో ఎక్కడో ఎవర్నో కలిశారని టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు.

శనివారం నాడు ఆయన  వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు.  ఎన్నికలకు తమ కంటే ప్రజలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు ఆయన  తెలిపారు.  ఎన్నికల్లో టిడిపిని చిత్తు చిత్తుగా ఓడించేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన చెప్పారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పూర్తిగా కూరుకుపోయారని చెప్పారు.  అవినీతిని ప్రజల ముందుకు తెస్తామన్నాను. తప్పు చేయకపోతే  టిడిపి నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు అవినీతిని బట్టబయలు చేస్తామని ఆయన చెప్పారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని అభివృద్ది చేసే శక్తి వైసీపీకే ఉందన్నారు.

బాబు అవినీతిపై దేశంలోని రాజ్యంగబద్దమైన అన్ని సంస్థలను కలవనున్నట్టు బొత్స సత్యనారాయణ చెప్పారు.అంతేకాదు ఆయా రాజకీయ పార్టీల నేతలను కూడ కలిసి బాబు అవినీతిపై  ఫిర్యాదులు చేస్తామని ఆయన చెప్పారు.

పీఏసీ ఛైర్మెన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ఎవరినో కలిశారని  టిడిపి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. ట్యాంపరింగ్ చేయడం టిడిపి నేతలకు కొత్తేం కాదన్నారు.  లాగ్ బుక్ లో తేదిలను ట్యాంపరింగ్ చేశారిన  బొత్స ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios