టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏపీలో పొత్తు ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి
అమరావతి: టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏపీలో పొత్తు ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో ఈ పొత్తు సరైన ఫలితాలు సాధించకపోవడంతో ఏపీలో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసే అవకాశం కన్పిస్తోంది.
గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌లుే కలిసి పోటీ చేశాయి. పీపుల్స్ ఫ్రంట్‌గా పోటీ చేసినా ఈ కూటమిలోని పార్టీలకు సరైన ఫలితాలు రాలేదు.
కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాలు, టీడీపీ రెండు స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకోవడంపై ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు.
అయితే ఈ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ టీడీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఏపీ రాష్ట్ర ప్రజలకు ఆలోచనలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.
గత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోశారు. కానీ, దేశ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో చంద్రబాబునాయుడు కీలకంగా పనిచేస్తున్నారు. ఈ పార్టీలన్నీ కూడ కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తాయని బాబు చెబుతున్నారు. అయితే దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తూ ఏపీలో మాత్రం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పోటీ చేయడాన్ని ఎలా సమర్ధించుకొంటారనే ప్రశ్నలు కూడ ఉత్పన్నమయ్యే అవకాశం కూడ లేకపోలేదు.
అయితే ఏపీ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌తో కలిసి జట్టు కట్టడం కంటే వేర్వేరుగా పోటీ చేయడమే మేలనే అభిప్రాయంతో ఉన్నారు. బీజేపీయేతర పార్టీలుగా ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే ప్రత్యర్థులకు లాభం చేకూరే విధంగా ఉండకూడదనే అభిప్రాయాలను కూడ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం అభిప్రాయంతో ఉంది.
ఇటీవలనే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత చంద్రబాబునాయుడు చేసిన కామెంట్స్ కాంగ్రెస్‌తో పొత్తు ఉండదనే సంకేతాలు ఇచ్చినట్టుగా ఉందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.. ఇదే అభిప్రాయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 11, 2019, 8:51 PM IST