చంద్రబాబు నాయుడు చేసుకున్న అభ్యర్ధనను నీతి ఆయోగ్ సున్నతంగా తిరస్కరించింది.  చంద్రబాబు నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని 18 వతేదీకి వాయిదా వేయాలంటూ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ ని కోరిన విషయం తెలిసిందే. దీనిపై స్పందిచిన ఆయన ఎట్టి పరస్థితుల్లో వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఈ నెల 16 వతేదీన ముస్లీంల పవిత్ర పండుగ రంజాన్ ఉన్నందును తాను నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావడం కుదరకపోవచ్చని చంద్రబాబు అన్నారు. కాబట్టి సమావేశాన్ని కాస్త వాయిదా వేసి 17 వ తేదీ మద్యాహ్నం నుండి కానీ, 18 వ తేదీన కానీ నిర్వహిస్తే బావుంటుందని రాజీవ్ కుమార్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. తాను 16 న రంజాన్ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఇక 18 వ తేదీన ఈద్ మిలాప్ కార్యమాలున్నాయని ఈ లేఖలో చంద్రబాబు పేర్కొన్నాడు.

అయితే ఇప్పటికే ఒక సారి నీతి ఆయోగ్ సమావేశాన్ని వాయిదా వేశామని అందువల్ల ఈ సారి వాయిదా వేయడం కుదరదని రాజీవ్ సాగర్ తెలియజేశారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ 4 వ సమావేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి వాయిదాలు లేకుండా నిర్వహిస్తామని ఆయన అన్నారు. దీంతో ఈ సమావేశానికి ఎపి సీఎం చంద్రబాబు పాల్గొనడం ఇక అసాధ్యంగా కనిపిస్తోంది.