తనను ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ గా  తిరిగి నియమించాలని తీర్పును ప్రభుత్వం అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని  నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది  హైకోర్టు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా తిరిగి నియమించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును  అమలు చేయడం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.

నిమ్మగడ్డ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయితీ రాజ్ కార్యదర్శి,  ఏపీ ఎన్నికల కార్యదర్శులకు చేర్చారు రమేష్ కుమార్. ఉన్నత న్యాయ స్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిందని ఆ పిటిషన్ లో రమేష్ కుమార్ ఆరోపించారు.

also read:నిమ్మగడ్డ కేసు: జగన్ ప్రభుత్వానికి సుప్రీంలో మరోసారి చుక్కెదురు

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియమనిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. అంతేకాదు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రమేష్ కుమార్ స్థానంలో కనగరాజ్ ను నియమించింది. కనగరాజ్ ను ఏపీ కొత్త ఎన్నికల సంఘం కమిషనర్ గా ఈ ఏడాది ఏప్రిల్ 11న నియమించింది. ఈ మేరకు 619 జీవో జారీ చేసింది.

ఈ విషయమై నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అన్ని పిటిషన్లను కలిపి విచారించిన హైకోర్టు ఈ ఏడాది మే 29వ తేదీన కీలకమైన తీర్పు ఇచ్చింది.

also read:జగన్ కు హైకోర్టు షాక్: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డనే, ఆర్టినెన్స్ రద్దు

ఎన్నికల సంఘం కమిషనర్ నియామకం కోసం తెచ్చిన ఆర్డినెన్స్ తో పాటు కనగరాజ్ నియామకానికి సంబంధించిన జీవోలను కూడ హైకోర్టు కొట్టేసింది.ఈ విషయమై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను ప్రభుత్వం దాఖలు చేసింది. అక్కడ కూడ ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది.

తనను ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నట్టుగా ఇవాళ కోర్టును ఆశ్రయించాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్.