న్యూఢిల్లీ: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో మరోసారి ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమించాలని ఇటీవలనే గవర్నర్ ఆదేశించిన విషయం తెలిసిందే.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ  పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం  సుప్రీం కోర్టు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై శుక్రవారం నాడు సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసులో పిటిషన్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.గవర్నర్ లేఖ పంపినా కూడ పోస్టింగ్ ఇవ్వకపోడం దారుణమని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయపడ్డారు. 

also read:నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో జగన్ కు షాక్: హైకోర్టు సంచలన ఆదేశాలు

ఈ కేసులో ప్రతి విషయం తమకు తెలుసునని ప్రకటించింది కోర్టు.గవర్నర్ సలహాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వచ్చే శుక్రవారంలోపుగా హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 

జడ్జిలను, జడ్జిమెంట్లను ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్నారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు  దృష్టికి తీసుకెళ్లారు. ఆ క్లిప్పింగ్ లను కూడ ఇవ్వాలని కూడ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు  వారం రోజుల పాటు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. హైకోర్టు తీర్పు అమలుకు గవర్నర్ జోక్యం చేయాల్సి వచ్చింది. ఇది కోర్ఠు ధిక్కరణగానే పరిగణించాల్సిందేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.