ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ హైదరాబాద్ చేరుకున్నారు. ఇటీవల ఆయనను సెర్బియా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. నిమ్మగడ్డ అరెస్ట్ చెల్లదని సెర్బియా తీర్పు ఇవ్వడంతో ఆయన హైదరాబాద్ వచ్చారు.

Also Read నిమ్మగడ్డ ప్రసాద్ కి అరెస్ట్ వారెంట్...

రస్ ఆల్ ఖైమా ఫిర్యాదుతో గతేడాది ఆగస్టులో సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.. అయితే నిమ్మగడ్డ ప్రసాద్ నిర్బంధం చెల్లదని సెర్బియా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో సెర్బియా నిర్భందం నుంచి విడుదలైన నిమ్మగడ్డ... సెర్బియా నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. 

ఇక, కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో విదేశాల నుంచి వచ్చిన వారినందరినీ క్వారెంటైన్‌కు తరలిస్తుండగా... శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ చేరుకున్న నిమ్మగడ్డను కూడా.. విమానాశ్రయం నుంచి క్వారెంటైన్‌కు తరలించారు. 

జగన్ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ కూడా నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. సెర్బియాలో నిమ్మగడ్డను అరెస్ట్ చేయడానికి కూడా వాన్ పిక్ వ్యవహారమే కావడం గమనార్హం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్, నిమ్మగడ్డ మరికొందరు రాజకీయ పెద్దలు కొందరు భారీ కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వాటితోనే వారు రూ. వందల కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి.