ఆ డైరీ ఆధారంగానే.. : మావోయిస్టు ఆర్కే భార్య శిరీష అరెస్ట్‌పై ఎన్‌ఐఏ ప్రకటన
మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) భార్య శిరీష అలియాస్ పద్మను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజా ఆర్కే భార్య శిరీష అరెస్ట్‌పై ఎన్‌ఐఏ ప్రకటన చేసింది.

మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే) భార్య శిరీష అలియాస్ పద్మను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజా ఆర్కే భార్య శిరీష అరెస్ట్‌పై ఎన్‌ఐఏ ప్రకటన చేసింది. శిరీషను అరెస్ట్ చేసినట్టుగా పేర్కొంది. ఆర్కే డైరీ ఆధారంగా శిరీషను అరెస్ట్ చేశామని చెప్పింది. శిరీషతో పాటు దుడ్డు ప్రభాకర్‌ను కూడా అరెస్ట్ చేశామని తెలిపింది. దుడ్డు ప్రభాకర్, శిరీషలు మావోయిస్టుల కోసం పనిచేస్తున్నారని.. వారితో కాంటాక్ట్‌లో ఉన్నారని పేర్కొంది.
మావోయిస్టుల నుంచి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయని గుర్తించినట్టుగా ఎన్‌ఐఏ పేర్కొంది. 2019 తిరియా ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పాల్గొన్నారని.. మావోయిస్టుల కోసం రిక్రూట్‌మెంట్ కూడా చేస్తున్నారనని చెప్పింది. మావోయిస్టుల వారోత్సవాల వేళ భారీ కుట్రకు ప్లాన్ చేశారని ఆరోపించింది.
ఇదిలా ఉంటే, ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు గ్రామానికి వెళ్లిన ఎన్‌ఐఏ అధికారులు.. గ్రామంలోని శిరీష్ ఇంటికి చేరుకుని ఆమెను విచారించారు. సోదాలు కూడా నిర్వహించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తెలియని ప్రదేశానికి తరలించారు. ఎలాంటి కారణం చూపకుండానే శిరీషను ఎన్‌ఐఏ అధికారులు తీసుకెళ్లారని ఆమె బంధువులు ఆరోపించారు. కారణం చెప్పకుండా మహిళను అరెస్ట్ చేయడం అన్యాయమని వారు పేర్కొన్నారు. శిరీషను ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా అధికారులు చెప్పలేదని.. ఆమెను వెంటనే విడుదల చేయాలని ఎన్ఐఏ అధికారులను డిమాండ్ చేశారు.
మరోవైపు విజయవాడలో దుడ్డు ప్రభాకర్‌ను ఎన్‌ఐఏ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. విజయవాడ అజిత్‌సింగ్ నగర్‌లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న ఎన్‌ఐఏ బృందాలు.. సో దాలు నిర్వహించిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలపై ప్రభాకర్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.