చిత్తూరు జిల్లాలో ఎన్ఐఏ సోదాలు: నక్సలిజం వైపు యువతను మళ్లిస్తున్నారని అంజి అరెస్ట్


చిత్తూరు జిల్లాలోని అమ్మచెరువుమిట్టలో  ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు. అంజి అలియాస్ ఆంజనేయులు ఇంట్లో సోదాలు చేసి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

NIA Arrested Anjaneyulu In Chittoor District

చిత్తూరు: Chittoor జిల్లాలోని Ammacheruvumittaలో  NIA  సోదాలు నిర్వహించారు.  అంజి అలియాస్ Anjaneyulu ఇంట్లో ఎన్ఐఏ అధికారులు శుక్రవారం నాడు సోదాలు నిర్వహించారు. యువతను నక్సలిజం వైపునకు అంజి ప్రోత్సహిస్తున్నారని కచ్చితమైన సమాచారం ఆధారంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. అంజి ఇంట్లో  ఎన్ఐఏ అధికారులు  పలు డాక్యుమెంట్లు, పరికరాలను ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు.

2021 నవంబర్ 21న కూడా తెలుగు రాష్ట్రాల్లోని పలువురి ఇళ్లలో  ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మాజీ మావోయిస్టుల ఇళ్లలో సానుభూతిపరుల ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది.  విప్లవ రచయిత కల్యాణ్ రావు నివాసంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. అదే విధంగా విశాఖపట్నంలోని అనురాధ మాజీ మావోయిస్టు రవిశర్మ నివాసంలో సైతం సోదాలు చేశారు.

also read:దావుద్ ఇబ్ర‌హీం స‌హ‌చ‌రుల ఇళ్ల‌పై దాడులు చేసిన ఎన్ఐఏ

కల్యాణ్ రావు గతంలో మావోయిస్టు చర్చల ప్రతినిధిగా పనిచేశారు. అంటరాని వసంతం నవల రాసిన ఆయన విప్లవ రచయితల సంఘం (విరసం)లో కీలక పాత్ర పోషిస్తున్నారు. విప్లవ సానుభూతిపరులకు, మాజీ మావోయిస్టులకు మావోయిస్టులతో ఉన్న సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. గతంలో కూడా ఎన్ఐఏ ఇటువంటి సోదాలు నిర్వహించింది. 

మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ మీద ఓ పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకం కాపీలను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఆ పుస్తక ప్రచురణ చేపట్టిన నవ్య అధినేత రామకృష్ణా రెడ్డిపై కూడా కేసు నమోదు చేసింది. ఆర్కే జీవిత చరిత్రపై రాసిన ఆ పుస్తకంపై కూడా ఎన్ఐఏ ఆరా తీస్తోందిఇటీవల మరణించిన మావోయిస్టు అగ్రనేత ఆర్కేకు కల్యాణ్ రావు  బంధువు. దాంతో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని ఆయన నివాసంలో సోదాలు చేశారు.

గతంలో తెలంగాణ రాస్ట్రంలో విరసం నేత వరవరావును అరెస్ట్ చేసే సమయంలో కూడా ఎన్ఐఏ సోదాలు చేసింది. వరవరరావుతో పాటు ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా  ఎన్ఐఏ సోదాలు చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios