Asianet News TeluguAsianet News Telugu

రఘురామకృష్ణంరాజు అరెస్ట్‌ తీరుపై ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియస్: నోటీసులు జారీ

నర్సాపురం ఎంపీ రఘురామ అరెస్ట్‌ తీరుపై జాతీయ మానవహక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు  ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు ఎన్‌హెచ్‌ఆర్సీ శుక్రవారం నాడు నోటీసులు  జారీ చేసింది.  నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 

NHRC issues notices to AP DGP, Home prinicipal secretaries on raghu rama krishnam raju Raju arrest lns
Author
Guntur, First Published May 28, 2021, 3:47 PM IST

న్యూఢిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామ అరెస్ట్‌ తీరుపై జాతీయ మానవహక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు  ఏపీ డీజీపీ, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలకు ఎన్‌హెచ్‌ఆర్సీ శుక్రవారం నాడు నోటీసులు  జారీ చేసింది.  నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కస్టడీలో రఘురామపై పోలీసుల దాడికి సంబంధించి అంతర్గత విచారణ చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొంది. జూన్ 7లోగా నివేదికను ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. రఘురామ అరెస్ట్‌ తీరుపై ఎన్‌హెచ్‌ఆర్సీకి కుమారుడు భరత్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

also read:రఘురామ గాయాలపై సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నివేదిక: సీఐడి సంచలన ప్రకటన

సుప్రీంకోర్టు షరతులతో కూడిన  బెయిల్‌ మంజూరు చేయడంతో ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీకి వెళ్లారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన రఘురామకృష్ణంరాజు ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు.ఎయిమ్స్ లో ఎంపీ రఘురామకృష్ణంరాజును కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎయిమ్స్ వైద్యులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలుచేసేలా వ్యవహరించినందుకుగాను  ఈ నెల 14వ తేదీన ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios