అమరావతి:  పురుషోత్తంపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల పథకాలు అక్రమమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బుధవారం నాడు తీర్పు చెప్పింది.ఈ మూడు ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టులో భాగం కాదని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ తేల్చి చెప్పింది.

దీంతోఈ మూడు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా  తీసుకోవాలని ఎన్టీటీ ఆదేశించింది. పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రైతులకు నష్టపరిహారం అందించేందుకు ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేసింది ట్రిబ్యునల్. ఆరు మాసాలలోపుగా రైతులకు నష్టపరిహాం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరింది. 

ఈ మూడు ప్రాజెక్టులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బుధవారం నాడు విచారణ జరిపింది. ఈ విచారణలో ఈ మూడు ప్రాజెక్టుల విషయంలో ఎన్జీటీ కీలకమైన తీర్పు ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఈ మూడు ప్రాజెక్టులు అంతర్భాగంగా  ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేంద్ర  ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాదనతో కేంద్రం విభేదించింది. ఈ మూడు ప్రాజెక్టులు పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగం కాదని తేల్చి చెప్పాయి.