గాజువాక : జీవీఎంసి 64 వ వార్డు హై స్కూల్ రోడ్  పెంటయ్య నగర్ ప్రాంతంలో యువజంట ఆత్మహత్య చేసుకుంది .ఈ నవ దంపతులు ఆత్మహత్య చేసుకొన్న విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

సేనాపతుల నరేంద్ర , డిల్లీశ్వరి లు ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు.ఈ యువజంట పెద్దలను కాదని పెళ్లి చేసుకొన్నారు. ఇరువురు రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో రెండు నెలల క్రితం గాజువాక పెంటయ్యనగర్ లో ఇల్లు అద్దెకు తీసుకొని  నివాసం ఉంటున్నారు.

మృతుడు ఆటోనగర్ లో వెల్డర్ గా పనిచేస్తున్నాడని తెలిపారు గాజువాక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తాము నివాసం ఉంటున్న ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని నవ దంపతులు ఉరేసుకొన్నారు.

సంఘటన స్థలంలో మృతదేహాలను పరిశీలించిన పోలీసులు  పోస్టు మార్టం కోసం మృతదేహాలను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ నవదంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారనే విషయమై స్పష్టత రాలేదు.