పెళ్ళైన నాలుగు నెలలకే నవ దంపతుత సూసైడ్

ఏలూరు: పెళ్ళైన నాలుగు మాసాలకే భార్య, భర్తలు
ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా
రామన్నగూడెంలో చోటు చేసుకొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

పశ్చిమగోదావరి జిల్లాలోని రొయ్యలగూడెం మండలం
చొప్పనరామన్నగూడెంలో ఆదివారం రాత్రి నవదంపతులు
ఆత్మహత్యకు పాల్పడ్డారు.

 విజయరాజు, ప్రియాంకలకు నాలుగు నెలల క్రితం
వివాహమైంది. ఈ క్రమంలో కాపురం ఎక్కడ పెట్టాలనే
అంశంలో దంపతులు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి కూడా భార్య భర్తల మధ్య
చర్చ జరిగింది. హైదారాబాద్‌లో కాపురం పెట్టాలని
ప్రియాంక, చొప్పనరామన్నగూడెంలోనే ఉండాలని
విజయరాజు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. 

ఈ గొడవ కారణంగా అర్దరాత్రి పూట ప్రియాంక ఫ్యాన్ కు
ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియాంక సూసైడ్
చేసుకొన్న విషయాన్ని గుర్తించిన విజయరాజు కూడ
ఆత్మహత్య చేసుకొన్నారు.

చిన్న విషయానికే భార్య,భర్తలు ఆత్మహత్యకు పాల్పడడం
ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.