ఆంధ్రప్రదేశ్ లో 2024లో బోలెడు సెలవులు రానున్నాయి. సంవత్సరారంభమైన జనవరిలోనే 11నుంచి 13 సెలవులు ఉన్నాయి.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఈసారి సంక్రాంతికి నాలుగు నుంచి ఆరు రోజుల సెలవులు రానున్నాయి. ఆంధ్రులకు సంక్రాంతి పండగ అత్యంత ముఖ్యమైనది. సాధారణంగా ఈ పండుగకు రెండు, మూడు రోజులు సెలవులు ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం సంక్రాంతికి నాలుగు, ఆరు రోజులు సెలవులు ఉన్నట్లుగా తెలుస్తోంది. కొత్త సంవత్సరం 2024కి సెలవుల క్యాలెండర్ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ సెలవులు అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తాయి. ముందుగా జనవరిలో 13వ తేదీ సెకండ్ సాటర్ డే, జనవరి 14 ఆదివారంనాడు భోగి, జనవరి 15 సంక్రాంతి.. ఇవన్నీ సాధారణ సెలవులే. ఆ తర్వాత జనవరి 16వ తేదీన ఆప్షనల్ హాలిడే పెట్టుకోవచ్చు. ఇవి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తాయి. అయితే స్కూల్స్, కాలేజీల్లాంటి విద్యాసంస్థలకు మరో రెండు రోజులపాటు అదనంగా సెలవులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి : వైఎస్సార్సీపీలో 40మంది సిట్టింగులకు నో ఛాన్స్...
దీంతో మొత్తం వరుసగా ఆరు రోజుల పాటు సెలవులు వస్తాయి. జనవరి నెలలో 4 ఆదివారాలు ఉన్నాయి. దీనికి తేడు రెండో శనివారం, నాలుగో శనివారం.. కలిపి మొత్తంగా ఎక్కువగానే సెలవులు వస్తున్నాయి. ఒక్క 2024 జనవరి నెలలోనే దాదాపు 11 నుంచి 13 రోజులపాటు సెలవులు వస్తున్నాయి.
కొత్త సంవత్సరంలో.. ఏ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయంటే….
| నెం. | నెల, తేదీ | వారం | పండుగ |
| 1. | జనవరి 15 | సోమవారం | సంక్రాంతి |
| 2. | జనవరి 16 | మంగళవారం | కనుమ |
| 3. | జనవరి 26 | శుక్రవారం | రిపబ్లిక్ డే |
| 4. | మార్చి 8 | శుక్రవారం | మహాశివరాత్రి |
| 5. | మార్చ్ 25 | సోమవారం | హోలీ |
| 6. | మార్చి 29 | శుక్రవారం | గుడ్ ఫ్రైడే |
| 7. | ఏప్రిల్ 5 | శుక్రవారం | బాబు జగ్జీవన్ రామ్ జయంతి |
| 8. | ఏప్రిల్ 9 | మంగళవారం | ఉగాది |
| 9. | ఏప్రిల్ 11 | గురువారం | ఈద్-ఉల్-ఫితర్ |
| 10. | ఏప్రిల్ 17 | బుధవారం | శ్రీరామనవమి |
| 11. | జూన్ 17 | సోమవారం | బక్రీద్ |
| 12 | జులై 17 | బుధవారం | మొహర్రం |
| 13 | ఆగస్టు 15 | గురువారం | స్వాతంత్ర దినోత్సవం |
| 14 | ఆగస్టు 26 | సోమవారం | శ్రీ కృష్ణాష్టమి |
| 15 | సెప్టెంబర్ 7 | శనివారం | వినాయక చవితి |
| 16 | సెప్టెంబర్ 16 | సోమవారం | ఈద్ మిలాన్ ఉన్ నబీ |
| 17 | అక్టోబర్ 2 | బుధవారం | గాంధీ జయంతి |
| 18 | అక్టోబర్ 11 | శుక్రవారం | దుర్గాష్టమి |
| 19 | అక్టోబర్ 31 | గురువారం | దీపావళి |
| 20 | డిసెంబర్ 25 | బుధవారం | క్రిస్మస్ |
