కాకినాడలో ఓ బీబీఏ విద్యార్థిని అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఓ కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. దీంతో అది మిస్సింగా.. కావాలనే తప్పుదారి పట్టించే యత్నమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కాకినాడ : pithapuramలో అదృశ్యమైన విద్యార్థిని హారిక missing caseలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఉప్పాడ సెంటర్లో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న Harika విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. మూలమలుపు వద్ద బ్లూ కలర్ బస్సు ఎక్కుతున్న దృశ్యాలు CC Cameraలు స్పష్టంగా రికార్డయ్యాయి. అయితే హారిక అంతకుముందు తాను ఆటోలో వస్తున్నానని.. ఆటోడ్రైవర్ ప్రవర్తన తేడాగా ఉందని స్నేహితురాలికి whatsapp లో మెసేజ్ పెట్టింది. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అదే సమయంలో కొన్ని వాట్సాప్ గ్రూప్ లలో నుంచి లెఫ్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. హారిక కోసం ఐదు బృందాలుగా ఏర్పడి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అదృశ్యమైన విద్యార్థిని BBA Thirdyear చదువుతోంది. హాల్ టికెట్ కోసం హారిక పిఠాపురం నుంచి కాకినాడ వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
ఎప్పుడు జరిగింది?
కాగా, బుధవారం నాడు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో యువతి అదృశ్యం కలకలం రేపింది. కాకినాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న తవ్వా హారిక మార్చి 28వ తారీఖునాడు హాల్ టికెట్ కోసం కాలేజీకి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆటో డ్రైవర్ పై అనుమానం ఉందని హారిక తన స్నేహితురాలికి చివరిగా మెసేజ్ చేయడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. దీంతో ఆటో డ్రైవర్లను పోలీసులు విచారించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
సీసీ కెమెరాల్లో ఏముందంటే..
అయితే, పోలీసుల దర్యాప్తులో ఉప్పాడ సెంటర్లో హారిక బస్సు ఎక్కినట్లు సీసీ కెమెరాల్లో నమోదు అయిందని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు. ఆమె తన వాట్సాప్ లోని కొన్ని గ్రూపుల నుంచి లెఫ్ట్ అయినట్టు కూడా గుర్తించారు. దీంతో యువతి అదృశ్యం కేసులో పోలీసులు వేరే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ కేసును జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. డీఎస్పీ స్థాయి అధికారి, ఆరుగురు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విద్యార్థిని ఆచూకీ కోసం కాకినాడ పరిసర ప్రాంతాలు, వివిధ అనుమానిత ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దీనిమీద ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటికే పిఠాపురం స్టేషన్ లో కేసు నమోదు చేశామని తెలిపారు. హారిక కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రాథమిక సమాచారం సేకరించామని చెప్పారు.
అలాగే, యువతి మొబైల్ నెంబర్ తీసుకుని టెక్నాలజీ సాయంతో ఆచూకీ కోసం పూర్తిస్థాయి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా యువతి ఆచూకీ కనుక్కుంటామని కుటుంబ సభ్యులకు ఎస్పీ భరోసా కల్పించారు. ఎవరికైనా యువతి ఆచూకీ తెలిసినట్లయితే కాకినాడ డిఎస్పి9440796505, పిఠాపురం సీఐ 9440796523, పిఠాపురం ఎస్ఐ 9440796560 ఎస్సై నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.
