తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడల సుహారిక మరణంపై ఆమె భర్త ఫణీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య సుహారిక మృతిపై తనకు అనుమానాలున్నాయని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సుహారికకు ఎలాంటి చెడు అలవాట్లు లేవన్నారు. ఆ రోజు డ్రగ్స్ పార్టీ జరిగినట్లు ప్రచారం జరిగిందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీలో పాల్గొన్న నలుగురు తప్పించుకు తిరుగుతున్నారని ఫణీంద్ర చెబుతున్నారు.

Also Read:3 గంటల పాటు డ్యాన్స్, సుహారిక మరణానికి కారణం అదేనా: కీలకంగా పోస్ట్‌మార్టం నివేదిక

తొలుత సీబీఐటీ వద్ద చనిపోయిందని.. తర్వాత మాటమార్చారని చెప్పారు. అయితే తన తోడల్లుడుతో ఆర్ధిక వివాదాలున్నాయని ఫణీంద్ర తెలిపారు. అసలు నిజాలు బయటకు రావడం లేదని.. తన భార్యది హత్యా..? ఆత్మహత్యా అన్నది తేల్చాలని కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఫణీంద్ర సైబరాబాద్ పోలీసులను కోరుతున్నారు.

కన్నా లక్ష్మీనారాయణ రెండో కోడలు సుహారిక. భర్త ఫణీంద్రతో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలోని హిల్‌రిట్జ్ విల్లాస్‌లో ఆమె నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో సుహారిక మే నెల 28న అనుమానాస్పద స్థితిలో మరణించారు.

Also Read:కన్నా లక్ష్మినారాయణ కోడలి మృతి: మిత్రుడి ఇంట్లో విందు, డ్యాన్స్ చేస్తూ....

తన స్నేహితురాలి ఇంట్లో పార్టీకి వెళ్లిన ఆమె అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను రాయదుర్గంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా.. సుహారిక అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.