గోదావరి నదిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి వివాదం నెలకొంది. ఇసుక లేక నిర్మాణ పనులు నిలిచిపోయాయి. జేపీ వెంచర్స్‌తో పోలవరంను నిర్మిస్తోన్న మేఘా సంస్థకు వివాదం కారణంగానే ఈ పరిస్థితి చోటు చేసుకుంది
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మరో కొత్త సమస్య వచ్చి పడింది. మేఘ సంస్థ (meil) , జేపీ వెంచర్స్ (jp venture) మధ్య వివాదం కారణంగా ఇసుక లేక పోలవరం ప్రాజెక్టు డయాఫ్రంవాల్ పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను జేపీ వెంచర్స్‌కు అప్పగించింది ఏపీ ప్రభుత్వం. అయితే, పోలవరం ప్రాజెక్టు పరిధిలో ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఇసుకను వాడుకునేందుకు అన్ని అనుమతులు ఉన్నాయని మేఘ సంస్థ వాదిస్తోంది. అనుమతులు ఉన్నా ప్రాజెక్టు నిర్మాణానికి గోదావరి నుంచి ఇసుక తరలించడానికి వీల్లేదంటూ జేపీ వెంచర్స్ సిబ్బంది .. మేఘా సిబ్బందిని అడ్డుకుంటున్నారు.
గోదావరిలోని (godavari) ఇసుక రీచ్‌లన్నీ తమవేనని చెబుతున్నారు. ఇసుక తరలింపును జేపీ సిబ్బంది అడ్డుకోవడంతో పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి పోలవరానికి ఇసుక తరలించే 250 టిప్పర్లు నిలిచిపోయాయి. అధికారులను సైతం జేపీ వెంచర్స్ సిబ్బంది లెక్కచేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రంవాల్ నిర్మాణానికి దాదాపు కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని మేఘ సంస్థ అంటోంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో బయటివారికి అనుమతులు లేవని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని మేఘ సంస్థ చెబుతున్నా.. జేపీ వెంచర్స్ మాత్రం లెక్క చేయడం లేదు. మరి ఈ వివాదాన్ని ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి.
ఇకపోతే.. Polavaram ప్రాజెక్టులో కీలక ఘట్టం పూర్తైంది. ప్రాజెక్టు Spill wayలో 48 రేడియల్ గేట్లను అమర్చిన సంగతి తెలిసిందే. 2001 డిసెంబర్ 17న Radial Gates అమరిక పనులు ప్రారంభమయ్యాయి. గత సీజన్ లో వర్షా కాలంలో ప్రాజెక్టుకు వరదలు వచ్చే సమయానికి 42 రేడియల్ గేట్లను అమర్చి నీటిని దిగువకు విడుదల చేశారు. మిగిలిన ఆరు రేడియల్ గేట్లను ఇవాళ అమర్చారు. ఇప్పటికే రేడియల్ గేట్లకు 84 హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చారు. త్వరలోనే మిగిలిన ఆరు గేట్లకు కూడా 12 సిలిండర్లు అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
హైడ్రాలిక్ సిలిండర్లు అమర్చడం పూర్తైతే గేట్ల ఆపరేటింగ్ చేయవచ్చు. ఇప్పటికే గేట్లను ఎత్తడానికి అవసరమైన 24 పవర్ ప్యాక్ సెట్ల అమర్చారు. స్పిల్ వే లో 3,32,114 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను పూర్తి చేశారు. స్పిల్ వేలో కీలకమైన షిఫ్ ల్యాండర్ నిర్మాణం సైతం పూర్తి చేసిన విషయం తెలిసిందే. గత వారంలోనే కేంద్ర జల్ శక్తి మంత్రి Gajendra Singh Shekhawat , ఏపీ సీఎం YS jagan లు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. 2017–18 ధరల సూచీని అనుసరించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా రూ.55,548.87 కోట్ల రూపాయలకు ఖరారు చేయాలని రాష్ట్ర అధికారులు కేంద్ర మంత్రిని కోరారు. తాగునీటి కాంపొనెంట్‌ను ప్రాజెక్టులో భాగంగా పరిగణించాలని విజ్ఞప్తిచేశారు
