దారుణం.. పసికందును అమ్మకానికి పెట్టి.. వాట్సాప్ లో పోస్ట్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్...

ఓ ఆర్ఎంపీ డాక్టర్ దారుణానికి తెగబడ్డాడు. మూడు రోజుల పసికందు అమ్మకానికి ఉందంటూ వాట్సాప్ లో మెసేజ్ పోస్ట్ చేశాడు. 

new born baby for sale RMP doctor posted on WhatsApp in vijayawada

విజయవాడ : ఓ RMP doctor పసికందును అమ్మకానికి పెట్టాడు. ఈ ఘటన విజయవాడలో జరిగింది. నగరంలో ఉంటున్న అమృతరావు గత కొంతకాలంగా జిన కొండూరు మండలంలో ఆర్ఎంపీ డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. 3 రోజుల new born babyను అమ్మకానికి పెట్టాడు. ఓ వాట్సాప్ గ్రూపులో దీనికి సంబంధించిన సమాచారాన్ని అమృతరావు పోస్ట్ చేశారు. రూ3 లక్షలకు ఆ పసికందును అమ్మకానికి ఉంచినట్లు పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న దిశ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఇలాంటి ఘటనలు ఏపీలో ఏప్రిల్ 7న వెలుగులోకి వచ్చింది. పేదరికం కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని కొంతమంది మహిళలు తమ బిడ్డలను అమ్ముకుంటున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా ఏలూరు, మంగళగిరిలో ఇలాంటి రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. త‌మ వ‌ద్ద డ‌బ్బులు లేక పిల్ల‌ల‌ను పోషించుకునే స్థోమత లేక బిడ్డలను తమ కుటుంబ సభ్యులు అమ్ముకున్నారని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దు గ్రామమైన అశ్వారావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మూడు రోజుల పసికందును తండ్రి అరుణ్ కుమార్, అమ్మమ్మ గంటా మేరీలు రూ.2 లక్షలకు ఓ ఆర్ఎంపీ డాక్టర్ కు అమ్మారు. ఆయ‌న ఆ శిశువును విశాఖపట్నం దంపతులకు రూ. 3 లక్షలకు విక్రయించారు. చివరికి పసికందును అనకాపల్లి దంపతులకు రూ.5 లక్సలకు అమ్మారు. 

ఈ మొత్తం రాకెట్ లో ఈ ఆర్ఎంపీ డాక్టరే కీలకంగా ఉన్నాడు. జిల్లా బాలల సంరక్షణ అధికారి (DCPO) సూర్య చక్రవేణి తెలిపిన వివరాల ప్రకారం.. చింత‌ల‌పూడికి చెందిన పాప తల్లి గంటా చిలకమ్మను ప్రసవం కోసం శేషమ్మ నర్సింగ్‌హోమ్‌లో చేర్పించాల‌ని ఆర్‌ఎంపీ బుజ్జిబాబు ఒప్పించారు. డెలివ‌రీ అయిన త‌రువాత పాప‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ విష‌యాన్ని పాప త‌ల్లి అధికారులకు తెలిపారు. 

‘ఆర్ఎంపీ ఆయా ప్రశాంతి, ఆస్పత్రి ఉద్యోగి శ్రీనివాస్ ల ద్వారా డీల్ కుదుర్చుకున్నారు. ఆసుపత్రి యాజమాన్యం డెలివరీ కోసం రూ. 28,000 ఫీజుగా తీసుకుంది. తల్లికి జనన ధృవీకరణ పత్రం, బిల్లులు ఇవ్వలేదు’ అని డీసీపీఓ తెలిపారు. ఈ ఘటనపై అశ్వారావు పేట పోలీసులు బుధవారం సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ రాకెట్ లో ఆర్ఎంపీ బుజ్జిబాబుతో పాటు ఆయన భార్య సువర్ణ, ఆయాలు ప్రశాంతి, ఆస్పత్రి సిబ్బంది శ్రీనివాస్, మధ్యవర్తి రాణి ప్రమేయం ఉన్నట్లు సమాచారం. 

కాగా, ఇలాంటి ఘ‌టనే గుంటూరు జిల్లాలో వెలుగులోకి వ‌చ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన మేడబలిమి మనోజ్ అనే కూలీ తన మూడో కుమార్తె (రెండు నెలల వయస్సు)ను తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన మెగావత్ గాయత్రికి రూ. 70 వేలకు విక్ర‌యించారు. ఈ విష‌యాన్ని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జె.రాంబాబు తెలిపారు. గాయత్రి నల్గొండ జిల్లా లంబాడా దేవాల తాండాకు చెందిన భూక్య నందు అనే వ్యక్తికి ఆ శిశువును రూ.1.20 లక్షలకు అమ్మింది. త‌రువాత నందు ఆడబిడ్డను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన షేక్ నూర్జహాన్‌కు రూ.1.87 లక్షలకు విక్రయించాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios