మెగా బ్రదర్ , జనసేన నేత నాగబాబు మరోసారి నెటిజన్ల ట్రోల్స్ బారిన పడ్డారు. సినీ నటుడిగా, నిర్మాతగా తన కెరీర్ మొదలుపెట్టిన నాగబాబు.. ఆ తర్వాత జబర్దస్త్ లాంటి టీవీ షోకి జడ్జిగా వ్యవహరించారు. ఆ షోతో ప్రజలకు మరింత చేరువైన ఆయన ఇటీవల ఆ షోకి కూడా వీడ్కోలు పలికారు. అనంతరం మరో ఛానెల్ లో ప్రసారమయ్యే అదిరింది అనే షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

గతేడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో తన సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీలో చేరి.. మద్దతుగా నిలిచాడు. పార్టీ తరపున ప్రచారం కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన చేసిన కామెంట్స్ ని నెటిజన్లు బాగానే ట్రోల్ చేశారు. కాగా.. తాజాగా ఆయన కరోనా పై ట్వీట్ చేసి అడ్డంగా బుక్కయ్యారు.

''సర్వ జీవరాసులు ప్రకృతి ధర్మాలకు లోబడి బతుకుతున్నాయని, కరోనా వైరస్ సహా.. ఒక్క మనిషి తప్ప'' అని ఇటీవల ట్వీట్ చేసి.. తాజాగా మరో ట్వీట్ చేశారు.

Also Read చిరుకు జగన్ రాజ్యసభ సీటు ఆఫర్: నాగబాబు స్పందన ఇదీ.....

‘‘ కరోనా వైరస్ రావడంవ వల్ల చనిపోయినవారి కంటే.. వచ్చిందనే భయంతో చచ్చేవారు ఎక్కువయ్యారు’’ అంటూ తాజాగా నాగబాబు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఆ ట్వీట్ లో నాగబాబు కరోనా స్పెల్లింగ్ కూడా తప్పు రాశారు. దీంతో ముందు స్పెల్లింగ్ నేర్చుకోండి అంటూ కొందరు కౌంటర్లు వేస్తున్నారు. ఇంకొందరేమో.. అసలు కరోనా వల్ల డెత్ రేటు పెరిగిందని ఎవరు చెప్పారంటూ ట్వీట్ చేశారు.

‘‘మనకి ఈ విజ్ఞాన ప్రదర్శన ఎందుకు కులగజ్జి సూసైడ్ బాబు... వాడి మీద , వీడి మీద యెడ్చే వీడియోలు చేసుకుంటా, లేకి జోకులకి నవ్వుకుంటా.... లేని పెద్దరికం ప్రదర్శిస్తూ అలా బతికేదానికి...’’ అంటూ ఓ నెటిజన్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.

మరో నెటిజన్ అయితే... తెలుగే సరిగా రాదు.. మళ్లీ ఇంగ్లీషా అంటూ సెటైర్లు వేశారు. దీంతో నాగబాబు ట్వీట్ వైరల్ గా మారింది. కాగా... ఇటీవల కరోనా వైరస్ పై సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. పారాసెట్మాల్  వేసుకుంటే కరోనా తగ్గతుందంటూ ఆయన చేసిన కామెంట్స్ వీడియోని, ఇప్పుడు నాగబాబు ట్వీట్.. రెండూ కలిపి ట్రోల్ చేస్తున్నారు.