Asianet News TeluguAsianet News Telugu

టిడిపికి షాక్... సీఎం సమక్షంలో వైసిపిలోకి నెల్లూరు సీనియర్ నేత (వీడియో)

నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి షాకిస్తూ ఇద్దరు నాయకులు అధికార వైసిపిలో చేరారు. 

Nellore TDP Leaders joined YSRCP presence of CM YS Jagan  AKP
Author
First Published May 5, 2023, 4:46 PM IST

అమరావతి : నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష టిడిపికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. నెల్లూరు మాజీ జడ్పిటిసి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, ఆత్మకూరు మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఇందూరు వెంకటరమణారెడ్డికి వైసిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఈ చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్‌ రెడ్డి, వరప్రసాద్, వైఎస్సార్‌సీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వీడియో

కొంతకాలంగా నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో అధికార పార్టీకి తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి లు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డాడంటూ వైసిపి నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అంతకుముందే వైసిపిపై తిరుగుబాటు చేసారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 

వీరంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి ఓటేయడం వల్లే ఆ పార్టీ గెలిచిందని వైసిపి అధిష్టానం భావిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు ఆయా నియోకవర్గాల్లో ఇతర పార్టీల్లోని నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే గతంలో వైసిపిలోనే వుండి వెంకటగిరి టికెట్ ఆశించి భంగపడ్డ రాఘవేంద్ర రెడ్డి ఆనం సస్పెన్షన్ మళ్లీ సొంతగూటికి చేరాడు.  

Read More  నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్.. వైసీపీలోకి సీనియర్ నేత..? ఫ్యాన్‌కి కొత్త జోష్

ఇక మంత్రి పదవిలో వుండగానే మేకపాటి గౌతమ్ రెడ్డి  సడన్ గా మృతిచెందడం, కొందరు పార్టీని వీడటంతో నెల్లూరులో వైసిపి కాస్త బలహీనపడిందని రాజకీయా చర్చ మొదలయ్యింది. ఇది ఇలాగే కొనసాగితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదముందని భావించిన వైసిపి అధిష్టానం నెల్లూరు చేరికలను బాగా ప్రోత్సహిస్తోంది. ఇలా ఇప్పటికే కొందరు నాయకులను ఆకర్షించగా మరికొందరు నాయకులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం. ఎలాగైనాా నెల్లూరులో పార్టీని బలోపేతం చేసి మరోసారి సత్తా చాటాలని వైసిపి చూస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios