నన్ను తిట్టేందుకు మంత్రులకు 20 నిమిషాలు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
తన పట్ల ఏపీ ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరించిందని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
అమరావతి: తన విషయంలో ఏపీ ప్రభుత్వం అత్యంత దారునంగా వ్యవహరించిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఏపీ అసెంబ్లీ నుండి సస్పెన్షన్ కు గురైన తర్వాత బుధవారంనాడు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. నెల్లూరు రూరల్ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించే ప్రయత్నం చేసినట్టుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. కానీ తన పట్ల ప్రభుత్వం అత్యంత దారుణంగా వ్యవహరించిందన్నారు. అసెంబ్లీ చరిత్రలో ఇవాళ నల్ల అక్షరాలతో లిఖించదగిన రోజుగా ఆయన పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ ప్రజల సమస్యలను తాను సీఎం, మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
అధికార పార్టీకి దూరమైన తాను అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్తే పోలీసులతో అడ్డుకున్నారని ఎమ్మెల్యే శ్రీదర్ రెడ్డి ఆరోపించారు.. అసెంబ్లీలో తాను నాలుగు గంటలపాటు గాంధేయపద్దతిలో నిరసనకు దిగినట్టుగా శ్రీధర్ రెడ్డి తెలిపారు. తాను పట్టుకున్న ప్లకార్డులను ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు చించివేశారని ఆయన చెప్పారు. తనను తిట్టేందుకు ఇద్దరు మంత్రులకు 20నిమిషాల సమయం ఇ,చ్చారన్నారు. ఇదేం దుర్మార్గమని ఆయన ప్రశ్నించారు. కానీ తనకు మాత్రం ఐదు నిమిషాలు మాట్లాడేందుకు సమయం కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
also read:కోటంరెడ్డి, 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్: ఆ ముగ్గురిపై సెషన్ పూర్తయ్యే వరకు వేటు
ఇవాళ ఉదయం అసెంబ్లీ వెలుపల కూడ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసనకు దిగారు.మరో వైపు అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కూడా అసెంబ్లీలో కూడా ఆయన నిరసన నిర్వహించారు. స్పీకర్ పోడియం ముందు నిరసనకు దిగడంతో ఈ సెషన్ పూర్తయ్యే వరకు శ్రీధర్ రెడ్డిని అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు.