Asianet News TeluguAsianet News Telugu

నెల్లూరులో టీడీపీ బ్లాస్ట్: వైసీపీలోకి చంద్రబాబు సన్నిహితులు

ఇకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో సైతం వీరు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ ది కూడా ఒకే సామాజిక వర్గం కావడంతో ఆయన కూడా బీద సోదరులు వైసీపీలో చేరే అంశంపై పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 

Nellore politics: Beeda masthanrao brothers may quit tdp likely to join ysrcp
Author
Nellore, First Published Dec 4, 2019, 5:45 PM IST

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుందా...? 2019 ఎన్నికల అనంతరం మూగబోయిన తెలుగుదేశం పార్టీ పూర్తిగా మూగబోయే పరిస్థితి నెలకొందా....? మాజీమంత్రి నారాయణ పట్టించుకోకపోవడం, కీలక నేతలు రాజకీయాలకు దూరంగా ఉండటంతో నెల్లూరులో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారే అవకాశం ఉందా..? 

నెల్లూరు జిల్లాలో సైనికులు లేని రాజ్యంగా తెలుగుదేశం పార్టీ మారబోతుందా అంటే అవుననే సమాధానాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన బీద మస్తానరావు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

బీద మస్తాన్ రావు సోదరుడు బీద రవిచంద్ర ఇద్దరూ స్వయానా సోదరులు. రవిచంద్ర ప్రస్తుతం నెల్లూరు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. బీద సోదరులు ఇద్దరూ తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు శ్రమించారని జిల్లాలో టాక్. 

తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీకోసం ఎంతో కష్టపడ్డారని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బీద సోదరులను అంతగా చంద్రబాబు పట్టించుకోలేదని బీద వర్గీయులు ఆరోపిస్తున్నారు. 

బీద సోదరులలో ఒకరికి రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో బీద రవిచంద్రయాదవ్ కు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారని చెప్పుకొస్తున్నారు.  

బీద మస్తాన్ రావుకు చెందిన వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు జరిగినా చంద్రబాబు నాయుడు అండ్ కో అంతగా పట్టించుకోలేదని బీద వర్గీయులు ఆరోపిస్తున్నారు. టికెట్ల కేటాయింపుల్లో కూడా అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. 

చివరికి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సిన ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీలోకి చేరడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీద మస్తాన్ రావును ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారంటూ విమర్శిస్తున్నారు. ఇష్టం లేకపోయినా బీద మస్తాన్ రావు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చిందంటున్నారు.  

వైసీపీ వైపు మరో మాజీ ఎమ్మెల్యే... చంద్రబాబుకి మరో షాక్

మస్తాన్ రావు గెలుపు కోసం డబ్బు ఖర్చుపెట్టినా వైసీపీ వేవ్ లో కొట్టుకుపోయారు. దాంతో ఆర్థికంగా చితికి పోయారు. అలాగే మ‌స్తాన్ రావు ప్రముఖ వ్యాపార సంస్థ బీఎంఆర్‌ కూడా నష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. రియ‌ల్ ఎస్టేట్, ఆక్వా ఎక్స్ పోర్ట్ వంటి సంస్థలు ఆర్థికంగా నష్టాలు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.  

ఇకపోతే తెలుగుదేశం పార్టీలో ఎలాంటి పదవులు లేకపోవడం, వ్యాపారాల రీత్యా బీద మస్తాన్ రావు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన రహస్యంగా సీఎం జగన్ ను, వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిని కలిశారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. 

బీద రవిచంద్రయాదవ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తరుణంలో ఆయన వైసీపీలో చేరాలా వద్దా అనే అంశంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ పదవి కోల్పోయే అవకాశం వస్తుందేమోనన్న ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. 

ఇకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో సైతం వీరు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ ది కూడా ఒకే సామాజిక వర్గం కావడంతో ఆయన కూడా బీద సోదరులు వైసీపీలో చేరే అంశంపై పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. 

మెుత్తానికి బీద కుటుంబంలో వైసీపీ చిచ్చు పెట్టినట్లైంది. బీద మస్తాన్ రావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటే, బీద రవిచంద్రయాదవ్ మాత్రం గందరగోళంలో ఉన్నారు. ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు.    

వైసీపీ వైపు మరో మాజీ ఎమ్మెల్యే... చంద్రబాబుకి మరో షాక్

Follow Us:
Download App:
  • android
  • ios