ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది.   

ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదని కారణంతో ఇంటర్ విద్యార్థిని గొంతుకోశాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన ప్రేమోన్మాది చెంచుకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. వివరాలు.. సోమవారం ఉదయం కాలేజిమిట్ట ప్రాంతంలో ఇంటర్ విద్యార్థి జ్యోతిపై ప్రేమోన్మాది చెంచుకృష్ణ కత్తితో దాడి చేశాడు.తనను ప్రేమించలేదని కోపంతో ఈ దాడికి పాల్పడ్డారు. వెంటనే జ్యోతిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించాలని వైద్యులు సూచించారు.

జ్యోతిని ప్రేమిస్తున్నానని చెంచుకృష్ణ కొంతకాలంగా ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ విషయాన్ని జ్యోతిక తల్లిదండ్రులకు తెలియజేసింది. ఈ విషయం పోలీసులుకు తెలియజేసినా కూడా స్పందించలేదని బాధితురాలి బంధువులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా పోలీసులు తెలిపారు.