Nellore City assembly elections result 2024 : నెల్లూరు అర్భన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 LIVE
Nellore City assembly elections result 2024 live : ఆంధ్ర ప్రదేశ్ లోని మరో అర్భన్ అసెంబ్లీ నియోజకవర్గం నెల్లూరు. నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఈ నియోజకవర్గ పరిధిలోని వస్తుంది. ప్రస్తుతం నెల్లూరు అర్భన్ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. ఈ నియోజవర్గ పరిధిలో ముస్లిం ఓటర్లు అధికంగా వుండటంతో ఈసారి మైనారిటీ నేతను బరిలోకి దింపింది వైసిపి. మరి నెల్లూరు ఓటర్ల తీర్పు ఎలా వుంటుందో చూడాలి.
Nellore City assembly elections result 2024 live :
నెల్లూరు అర్భన్ రాజకీయాలు :
నెల్లూరు జిల్లా రాజకీయాలకు కేంద్రబిందువు ఈ అర్భన్ నియోజకవర్గం. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు ఇక్కడ ఓటర్లు... కాబట్టి అన్నిప్రాంతాల పాలిటిక్స్ ఎఫెక్ట్ ఇక్కడ వుంటాయి. ఈ నియోజకవర్గంలో ఆనం కుటుంబంనుండి నలుగురు ఎమ్మెల్యేలుగా పనిచేసారు. 1955 లో ఆనం చెంచు సుబ్బారెడ్డి, 1972 లో ఆనం వెంకట రెడ్డి, 1983 లో ఆనం రామనారాయణ రెడ్డి, 1999, 2004 లో ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు అర్భన్ ఎమ్మెల్యేలుగా పనిచేసారు.
అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు (2014, 2019) అసెంబ్లీ ఎన్నికల్లోనూ నెల్లూరు అర్భన్ లో వైసిపిదే విజయం. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ జగన్ కేబినెట్ లో నీటిపారుదల మంత్రిగా కూడా పనిచేసారు. అంతకుముందు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుండి పోటీచేసిన ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి గెలిచారు.
నెల్లూరు అర్బన్ నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. నెల్లూరు అర్భన్ మండలం
నెల్లూరు అర్బన్ అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,38,836
పురుషులు - 1,16,810
మహిళలు - 1,21,947
నెల్లూరు అర్బన్ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను లోక్ సభ బరిలో నిలిపింది వైసిపి. దీంతో నెల్లూరు అసెంబ్లీలో మైనారిటీ నేత మహ్మద్ ఖలీల్ అహ్మద్ ను బరిలోకి దింపింది.
టిడిపి అభ్యర్థి :
తెలుగుదేశం పార్టీ మరోసారి నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణను నెల్లూరు పోటీలో నిలిపింది. గతంలో ఆయన చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేసారు.
నెల్లూరు అర్భన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
నెల్లూరు అర్భన్ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,58,363 (61 శాతం)
వైసిపి - అనిల్ కుమార్ యాదవ్ - 74,040 ఓట్లు (47 శాతం) - 2,988 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - పొంగూరు నారాయణ - 71,052 ఓట్లు (46 శాతం) - ఓటమి
నెల్లూరు అర్భన్ అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
వైసిపి- అనిల్ కుమార్ యాదవ్ - 74,372 (53 శాతం) - 19,087 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - శ్రీధర్ కృష్ణారెడ్డి - 55,285 (39 శాతం) - ఓటమి
- Andhra Pradesh Assembly Elections 2024
- Andhra Pradesh Congress
- Andhra Pradesh Elections 2024
- Anil Kumar Yadav
- JSP
- Janasena Party
- Mohammed Khaleel Ahmed
- Nara Chandrababu Naidu
- Nellore City Assembly
- Nellore City assembly elections result 2024
- Nellore Urban Politics
- Pawan Kalyan
- Ponguru Narayana
- TDP
- TDP Janasena Alliance
- TDP Janasena BJP
- Telugu Desam party
- Telugu News
- YCP
- YS Jaganmohan Reddy
- YSR Congress Party
- YSRCP