ఆంధ్రప్రదేశ్‌లో రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 8న ఎన్నికలు, 10న కౌంటింగ్ జరిపే అవకాశం వుంది. మరోవైపు ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ రోజు పదవీ విరమణ చేయనున్నారు.

కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే ఆమె పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే అవకాశం వుంది. 

ఐదేళ్ల పాటు పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ప్రభుత్వంతో పోరాడిమరీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. పదవీ కాలం ముగిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎస్ఈసీగా తన పదవీకాలం పూర్తి సంతృప్తినిచ్చిందని వెల్లడించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించామని.. ఇందులో ప్రభుత్వం తోడ్పాటు మరువలేనిదన్నారు. ముఖ్యంగా కలెక్టర్లు, పోలీసులు, ఇతర సిబ్బంది సహకరించారని వివరించారు.