ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్నీ నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ మీద హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వెకేషన్ తర్వాత విచారణ జరగనుంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ)గా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏపీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో నీలం సాహ్నిని నియమించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆ పిటిషన్ మీద హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సమ్మర్ వెకేషన్ తర్వాత ఆ పిటిషన్ మీద హైకోర్టు విచారణ చేపట్టనుంది.

నీలం సాహ్ని తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన తర్వాత ఆమెను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆమె ఆ పదవిలో కొనసాగుతున్న సమయంలోనే ఏపీ ఎస్ఈసీగా పదవీ విరమణ చేశారు. దాంతో ఆయన స్థానంలో ప్రభుత్వం ఆమెను ఏపీ ఎస్ఈసీగా నియమించింది.

ఆమె ఏపీఎస్ఈసీగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు ఈ ఎన్నికల పోలింగ్ జరిగినప్పటికీ కోర్టు ఆదేశాలతో ఓట్ల లెక్కింపును నిలిపేశారు. తాజాగా ఆ ఆ నోటిఫికేషన్ చెల్లదని, పరిషత్ ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.