రాష్ట్ర ప్రభుత్వంపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విమర్శలు సరికాదని వైసీపీ నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి అన్నారు. ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోందని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వంపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విమర్శలు సరికాదని తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి అన్నారు. వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా నియమితులైన ఆయన మాట్లాడుతూ.. ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఆనం, నేదురుమల్లి వర్గాలు లేవని.. ఒకటే జగన్ వర్గం ఉందని చెప్పారు. వెంకటగిరిలో పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలను తొలగించి ఏకతాటిపైకి తీసుకోస్తానని చెప్పారు. 

ఆనం రామనారాయణరెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోందని అన్నారు. వెంకటగిరిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తానని తెలిపారు. వెంకటగిరితో పాటు తిరుపతి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

Also Read: ఆనంపై వేటు.. వెంకటగిరి వైసీపీ ఇన్‌ఛార్జీ‌గా నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, హైకమాండ్ అధికారిక ప్రకటన

వైఎస్సార్‌సీపీలోని అత్యంత సీనియర్‌ నేతల్లో ఒకరైన రామనారాయణరెడ్డి ఇటీవల ప్రభుత్వంపైనా, పాలనపైనా విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై సీఎం జగన్ వేటు వేశారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని పార్టీ తొలగించారు. ఆ స్థానంలో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ మంగళవారం అధికారిక ప్రకటన చేసింది. ఆనం రామనారాయణ రెడ్డిపై విమ ర్శ లు చేస్తే పార్టీ ప్ర యోజ నాల కు భంగం వాటిల్లుతుంద ని, అందుకే కొత్త నేత ను నియోజ క వ ర్గ ఇంచార్జిగా నియ మిస్తున్న ట్లు పార్టీ వ ర్గాలు చెబుతున్నాయి.