వైసీపీలో చేరనున్న మాజీ ముఖ్యమంత్రి కుమారుడు

First Published 11, May 2018, 11:48 AM IST
nedhurumalli janardhanreddy family maybe join
Highlights

అభిమానుల నుంచి వైసీపీలో చేరాలని కేకలు వినిపించాయి..

 

వైసీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి.  తాజాగా మాజీ ముఖ్యమంత్రి, దివంగతనేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుటుంబం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంది. బుధవారం జనార్ధనరెడ్డి నాల్గవ వర్ధంతి సందర్బంగా అయన కుమారుడు రాంకుమార్ రెడ్డి పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు.  అనంతరం  ఏర్పాటు చేసిన కార్యకర్తల మీటింగులో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మాట్లాడారు. తన తండ్రి జనార్ధనరెడ్డి ఈ జిల్లాకు ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు..  ఇకపై రాజకీయాల్లోనే ఉంటానన్నారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరేది ఆగస్టులో వెల్లడిస్తానని చెప్తున్న సమయంలో అభిమానుల నుంచి వైసీపీలో చేరాలని కేకలు వినిపించాయి.. దానికి సమాధానం చెప్పిన రాంకుమార్ రెడ్డి మీకున్న కొరికే తనకు ఉందని అయితే మూడు నెలలు ఓపిక పట్టాలని సూచించారు. 

loader