Asianet News TeluguAsianet News Telugu

Navaratri: వైసిపి నాయకులే దగ్గరుండి...ఇంద్రకీలాద్రిపై అన్యమత ప్రచారం: జనసేన మహేష్ ఆగ్రహం

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో స్వయంగా వైసిపి నాయకులు దగ్గరుండి అన్యమతప్రచారం చేయిస్తున్నారని జనసేన నాయకులు పోతిన మహేష్ ఆరోపించారు. 

navaratri celebrations at vijayawada kanakadurga temle... janasena leader potina mahesh sensational comments
Author
Vijayawada, First Published Oct 8, 2021, 1:00 PM IST

విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో దసర శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ navaratri celebrations కోసం అరకోర ఏర్పాట్లు చేసి ప్రభుత్వం చేతులుదులుపుకుందని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆరోపించారు. నవరాత్రుల ప్రారంభంరోజున(గురువారం) కూడా అమ్మవారికి దర్శించుకున్న potina mahesh రెండోరోజు(శుక్రవారం) కూడా బాలాత్రిపుర సుందరి అవతారంలో వున్న kanakadurgamma ను దర్శించుకున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దసరా శరన్నవరాత్రుల సమయంలో వివిధ అవతారాల్లో కనిపించే అమ్మవారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులు భారీగా తరలివస్తున్నారని తెలిపారు. కానీ ఆలయ అధికారులు మాత్రం ప్రముఖులు, తెలిసిన వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలలో పనులు చేసేవారికి కూడా సరయిన సదుపాయాలు లేవన్నారు. 

''దసరా నవరాత్రులు రాష్ట్ర ఉత్సవమేనా... రాష్ట్ర ఉత్సవమే అయితే మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత? మీరు ఈ ఉత్సవాలకోసం కేటాయించామని చెబుతున్న రూ.70 కోట్ల నిధులు ఎందుకు ఇంకా అమ్మవారి ఖాతాకి రాలేదు. ఇది రాష్ట్ర ఉత్సవంలా లేదు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్సవంలా రంగులేసారు'' అని  మండిపడ్డారు. 

read more  విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు... గవర్నర్ దంపతుల తొలిపూజ (వీడియో)

''ఎంతో పవిత్రమైన ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగుతుంటే వైసిపి నాయకులు అన్యమత ప్రచారం‌ చేయిస్తున్నారు. ఆలయం ఏర్పాటు చేసిన స్క్రీన్స్ ద్వారా అన్యమత ప్రచారం జరిగిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ స్క్రీన్స్ కాంట్రాక్ట్  తీసుకున్న వ్యక్తి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి'' అని జనసేన నాయకుడు డిమాండ్ చేశారు. 

''దసరా ఉత్సవాలకోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో విధులు చేపట్టేందుకు ఇతర ఆలయాల ఈఓలను తీసుకొచ్చారు. ఇలా నలుగురు ఈఈలు, ప్రిన్సిపల్ సెక్రెటరీ పనిచేస్తున్నారు. అన్యమత ప్రచారం జరుగుతుంటే వీరంతా ఏం చేస్తున్నట్లు'' అని నిలదీసారు. 

''ఇంద్రకీలాద్రిపై ప్రతిఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసే ఉత్సవ శోభ ఏమైంది... ఐరన్ ఫ్రేం ఏమైంది... కనీసం మామిడి తోరణాలు కూడా లేవు. ఇది ఆధ్యాత్మిక కేంద్రం అనుకున్నారా లేక  వ్యాపార కేంద్రంగా భావించారు. సీఎం జగన్  పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చేనాటికైనా ఇవన్నీ సరి చేయాలి'' అని పోతిన మహేష్ డిమాండ్ చేశారు. 

''నవరాత్రి ఉత్సవాల కోసం ఒక వ్యక్తి ఆలయంలో చనిపోతే సంప్రోక్షణ ఎందుకు జరగలేదు. జనసేన ఎప్పుడూ అమ్మవారికి కాపలాదారుగా ఉంటుంది. అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేసి ఉత్సవాలు సవ్యంగా పూర్తిచేయాలి'' అని పోతిన మహేష్ సూచించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios