Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు... గవర్నర్ దంపతుల తొలిపూజ (వీడియో)

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

navaratri celebrations started at vijayawada kanakadurgamma temple
Author
Vijayawada, First Published Oct 7, 2021, 3:35 PM IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ రాష్ట్ర గవర్నర్ దంపతులు బిశ్వ భూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శించుకున్నారు. kanakadurgamma అలంకారం అనంతరం తొలిపూజలో పాల్గొన్నారు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ దంపతులు.  

navaratri ఉత్సవాల్లో తొలిరోజు ఆలయానికి విచ్చేసిన గవర్నర్ దంపతులకు ఆలయ పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు దగ్గరుండి గవర్నర్ దంపతులకు అమ్మవారి దర్శనం చేయించారు. 

అమ్మవారి దర్శనం అనంతరం గవర్నర్ Biswabhusan Harichandan మాట్లాడుతూ... తెలుగు ప్రజలకు అమ్మవారి కృప, కరుణాకటాక్షాలు లభించాలని కోరుకున్నట్లు తెలిపారు. భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆలయ అధికారులకు గవర్నర్ ఆదేశించారు. 

వీడియో

నవరాత్రుల్లో తొలిరోజయిన ఇవాళ అమ్మవారు స్వర్ణకవచాలంకృత అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన కుంకుమ పూజలో భక్తులు పాల్గొన్నారు. 

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఇవాళ అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరంలానే దసరా ఉత్సవాలలో సాధారణ భక్తులతో పాటు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. అమ్మవారి దయ అందరికీ ఉండాలని కోరుకున్నట్లు ఉమ తెలిపారు. 

ఇక మూలానక్షత్రమైన ఈ నెల 12న కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దర్శించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు అమ్మవారికి పట్టువ్రస్తాలు సమర్పించనున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios