విశాఖ జిల్లాకు చెందిన టిడిపి నాయకులు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నం మున్సిపల్ కమీషనర్ కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయ్యన్నపాత్రుడి తాతయ్య లచ్చా పాత్రుడు ఫోటోని కార్యాలయంలోని మరో గదిలోకి తాత్కాలికంగా మార్చినందుకు తనపట్ల అనుచితంగా మాట్లాడారంటూ ఫిర్యాదులో కమీషనర్ పేర్కోన్నారు.

తన తాతయ్య ఫోటోను మున్సిపల్ సిబ్బంది మార్చడంపై మున్సిపల్ కమిషనర్ పై  సోమవారం దారుణంగా దుర్భాషలాడిన అయ్యన్న. ఆయన ఫోటో నెల రోజుల లోపల ఎక్కడినుండి తీశారో అక్కడ పెట్టకపోతే గుడ్డలు ఊడదీసి దుస్థితి వస్తుంది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న నర్సీపట్నం మునిసిపల్ కమిషనర్ తోట కృష్ణ వేణి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై తగు చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.