వైసీపీ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు

వైసీపీ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడిన రఘురామ.. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసినందుకు నిన్న తనకు చాలా మంది ఫోన్ చేశారని చెప్పారు.

అక్కడితో ఆగకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. రాక్షసులను అంతమొందించే పనిలో పడిన తనకోసం కడప బ్యాచ్‌ను దించాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

Also Read:జగన్‌కు షాక్.. ఆయన బెయిల్ రద్దు చేయండి: హైకోర్టులో రఘురామకృష్ణం రాజు పిటిషన్

తనపై దాడి చేయడానికి కుట్ర పన్నుతున్నారని, దీనిపై ప్రధానికి ఫిర్యాదు చేస్తానని రఘురామ తెలిపారు. బాబాయిని చంపారని.. ఇప్పుడు ఎంపీని చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దీనిపై హోం శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేస్తానని.. అలాగే వివేకానంద రెడ్డి హత్య కేసులో విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాసినట్లు రఘురామకృష్ణం రాజు తెలిపారు.