Asianet News TeluguAsianet News Telugu

కృష్ణానదిలో ప్రమాదం: 20 మంది ప్రయాణికులతో నీట మునిగిన బల్లకట్టు

ప్రమాదం జరిగిన సమయంలో బల్లకట్టుపై సుమారు 20 మంది ఉన్నారు. అయితే వారంతా సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బల్లకట్టు స్థాయికి మించి వాహనాలను ఎక్కించడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే కృష్ణానదిలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 

Narrow Escape from Major Accident in krishna river
Author
Krishna district, First Published Feb 5, 2019, 3:24 PM IST

చందర్లపాడు: కృష్ణా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణానదిలో లారీని తీసుకొస్తుండగా బల్లకట్టు ఒక్కసారిగా మునిగిపోయింది. పుట్లగూడెం నుంచి గుడిమెట్లకు లారీని తీసుకొస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

 ప్రమాదం జరిగిన సమయంలో బల్లకట్టుపై సుమారు 20 మంది ఉన్నారు. అయితే వారంతా సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బల్లకట్టు స్థాయికి మించి వాహనాలను ఎక్కించడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే కృష్ణానదిలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. 

ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం రెగ్యులేటరీ అథారిటీని నియమించి ప్రమాదాలను అరికడతామని చెప్తున్నా ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. బల్లకట్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇదే ప్రాంతంలో భారీ ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. 

ఓవర్ లోడ్ తో వస్తున్న బల్లకట్టు సమీపంలోకి చేరుకునేలోపు ప్రమాదం చోటు చేసుకోవడంతో అంతా సురక్షితంగా బయటపడ్డారు. అదే నదిలో కానీ మధ్యలో మునిగిపోతే భారీ ప్రమాదం సంభవించేది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios