ప్రధానమంత్రి నరేంద్రమోడి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు.

సంచలన స్టేట్ మెంట్లకు మారుపేరైన సిపిఐ నేత డాక్టర్ కె. నారాయణ మరోమారు ముగ్గురు మూర్ఖులంటూ విరుచుకుపడ్డారు. ఇంతకీ ఎవరా ముగ్గురూ అని మీ అనుమానామా? వారేనండి ప్రధానమంత్రి నరేంద్రమోడి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. ఇంతకీ వారిని నారాయణ ముగ్గురు మూర్ఖులని ఎందుకు అన్నారో అర్ధమైందా?

రాష్ట్ర విభజన అనంతరం వారు ముగ్గురూ రాష్ట్ర ప్రజలను మోసం చేసారట. ఇంతకీ వారు చేసిన మోసం ఏమిటి? రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తానని ఇవ్వకపోవటం, ప్రత్యేక ప్యాకేజి, పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రజలను మోసం చేసారట. పైగా పెద్ద నోట్లను రద్దు చేసిన మోడి కార్పొరేట్లకు మాత్రం రూ. 1.60 లక్షల కోట్లను దోచిపెట్టే నిర్ణయం తీసుకున్నట్లు ధ్వజమెత్తారు. ప్రజలను మోసం చేసిన మోడికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని జోస్యం కూడా చెప్పటం కొసమెరుపు.