చంద్రబాబునాయుడుపై సిపిఐ నారాయణ సెటైర్లు వేశారు. చంద్రబాబుకు జైలు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడి వద్ద బానీస బతుకు బతుకుతున్నట్లు మండిపడ్డారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తోక ఆడిస్తే ప్రధాని వెంటనే జైల్లో పెట్టిస్తారని నారాయణ వ్యాఖ్యానించటంపై చర్చ మొదలైంది. ‘ఓటుకు కోట్లు’ కేసును గుప్పెట్లో పెట్టుకుని ప్రధాని చంద్రబాబును ఓ ఆట ఆడిస్తున్నారన్నారని అన్నారు. అందువల్లే రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించుకోలేకున్నారని మీడియాతో చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. అందుకే చంద్రబాబుది బానిస బతుకైపోయిందని ధ్వజమెత్తారు. పోలవరం నిర్మాణంపై సీపీఐ బృందం నేరుగా ప్రధానిని కలిసిందని, ఆ పని కూడా టీడీపీ చేయలేకపోయిందన్నారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలపై సోమవారం నుంచి జరిగే పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో చర్చించి ముసాయిదాను ఖరారు చేస్తామన్నారు.