రాయపాటి రాజీనామా..

రాయపాటి రాజీనామా..

కేంద్ర బడ్జెట్ ఏపిలో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లోగా ఇదే చివరి పూర్తిస్ధాయి బడ్జెట్ అవ్వటం, ఏడాదిలోపు ఎన్నికలుంటాయని ప్రచారం జరుగుతుండటంతో బడ్జెట్ చాలా కీలకమైంది. అయితే, కేంద్రబడ్జెట్లో ఏపికి సంబంధించిన కీలకమైన అంశాలపై ఒక్క ప్రస్తావనా లేదు. దాంతో భాజపా మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కేంద్రంపై మండిపోతున్నాయి.

ఇక రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిడిపి, వైసిపి అధినేతలు తప్ప మిగిలిన నేతలందరూ రాజీనామాలకు సిద్దమంటూ పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నారు. జనాలు కూడా ఎక్కడికక్కడ కేంద్రంపై నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఏ పార్టీకాపార్టీ సమావేశాలు నిర్వహించుకుంటున్నాయి. గురు, శుక్రవారాల్లో చంద్రబాబు వరుసగా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. దాంతో రాష్ట్ర రాజకీయాల్లో బాగా వేడిక్కెంది.

ఇదే నేపధ్యంలో నరసరావుపేట టిడిపి ఎంపి రాయపాటి మీడియాతో మాట్లాడారు. ఏపీకి జరిగిన అన్యాయంపై తాను రాజీనామాకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని ఆయన అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంపీలకు ఎంతో విలువ ఉండేదని కానీ, ఆర్ఎస్ఎస్ ఏది చెబితే బీజేపీ ప్రభుత్వం అదే చేసే పరిస్థితిలో ఉందని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఢిల్లీలో ఎంపీలను హీనంగా చూస్తున్నారని, ఏపీకి అన్యాయం చేస్తే కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. బీజేపీపై ప్రజలలో తీవ్ర ఆగ్రహం ఉందని రాయపాటి విమర్శలు గుప్పించారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page