నరసన్నపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live
శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గంలో వైసిపి కాస్త బలంగా కనిపిస్తోంది. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరులిద్దరూ ఈ నరసన్నపేట నుండి ప్రాతినిధ్యం వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న కృష్ణదాస్ మరోసారి బరిలో నిలిచారు. మరి ఈసారి నరసన్నపేట ఓటర్ల తీర్పు ఎలావుంటుందో చూడాలి.
నరసన్నపేట నియోజకవర్గ రాజకీయాలు :
ఉత్తరాంధ్రలో ధర్మాన కుటుంబానికి మంచి పట్టున్న నియోజకవర్గం నరసన్నపేట. 1989, 1999 లో ధర్మాన ప్రసాదరావు, ఆ తర్వాత వరుసగా రెండుసార్లు (2004, 2009) ధర్మాన కృష్ణదాస్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటంతో ధర్మాన కృష్ణదాస్ కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. దీంతో 2012 లో నరసన్నపేట అసెంబ్లీకి ఉపఎన్నిక జరగ్గా కృష్ణదాస్ వైసిపి నుండి పోటీచేసి గెలిచారు. ఇక 2019 లో మరోసారి గెలిచిన కృష్ణదాస్ కు మంత్రిపదవి దక్కింది.
నరసన్నపేటలో టిడిపి కాస్త బలహీనంగానే వుందని గత ఎన్నికలను పరిశీలిస్తే అర్థమవుతుంది. 1983,1985 లో సిమ్మా ప్రభాకరరావు, 1994 బగ్గు లక్ష్మణరావు తర్వాత ఇక్కడ చాలాకాలం టిడిపికి గెలుపేలేదు. ధర్మాన సోదరులను హవాను తట్టుకుని 2014 లో బగ్గు రమణమూర్తి విజయం సాధించారు.
నరసన్నపేట నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. జలుమూరు
2. నరసన్నపేట
3. సారవకోట
4. పోలాకి
నరసన్నపేట అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,10,451
పురుషులు - 1,06,624
మహిళలు - 1,03,811
నరసన్నపేట అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మరోసారి నరసన్నపేటలో పోటీ చేస్తున్నారు.
టిడిపి అభ్యర్థి :
ప్రతిపక్ష కూటమి అభ్యర్థిగా టిడిపి నేత రమణమూర్తి బగ్గు నరసన్నపేటలో పోటీ చేస్తున్నారు.
నరసన్నపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
నరసన్నపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
నరసన్నపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి 99951 ఓట్లతో విజయం సాధించారు.
నరసన్నపేట అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,64,038 (79 శాతం)
వైసిపి - ధర్మాన కృష్ణదాస్ - 86,797 ఓట్లు (52 శాతం) - 19,555 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - రమణమూర్తి బగ్గు - 67,242 ఓట్లు (41 శాతం) - ఓటమి
నరసన్నపేట అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,55,156 ఓట్లు (79 శాతం)
టిడిపి - రమణమూర్తి బగ్గు - 76,559 (49 శాతం) - 4,800 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - ధర్మాన కృష్ణదాస్ - 71,759 (46 శాతం) - ఓటమి
- Andhra Pradesh Assembly Elections 2024
- Andhra Pradesh Congress
- Andhra Pradesh Elections 2024
- Baggu Ramanamurthy
- Dharmana Krishnadas
- Dharmana Prasadrao
- JSP
- Janasena Party
- Nara Chandrababu Naidu
- Narasannapeta Assembly
- Narasannapeta assembly elections result 2024
- Pawan Kalyan
- TDP
- TDP Janasena Alliance
- TDP Janasena BJP
- Telugu Desam party
- YCP
- YS Jaganmohan Reddy
- YSR Congress Party
- YSRCP
- narasannapeta Politics
- Narasannapeta assembly elections result