అన్నాక్యాంటీన్లు శెభాష్ అన్న జాతీయ మీడియా.. ఈనాడు ఎప్పుడో చెప్పిందన్న లోకేశ్

nara lokesh tweet against anna canteen success
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అన్నక్యాంటీన్లను జాతీయ మీడియా ఆకాశానికెత్తేసింది. రెండు  రోజులుగా ఇదే విషయంపై పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అన్నక్యాంటీన్లను జాతీయ మీడియా ఆకాశానికెత్తేసింది. రెండు  రోజులుగా ఇదే విషయంపై పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని తెలుగుదేశం సోషల్ మీడియా వింగ్ తన గ్రూపుల్లో భారీగానే ప్రచారం చేసింది. తాజాగా అన్నక్యాంటీన్లపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాల పేపర్ కటింగ్స్‌ను నారా లోకేశ్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.

వీటిలో మనీ కంట్రోల్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ఐబీటీ, బిజినెస్ స్టాండర్డ్, ఏఎన్ఐ, డెక్కన్ క్రానికల్‌తో పాటు ఓ తమిళ పత్రిక ఉంది... 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు .. టీడీపీ సూపర్‌హిట్ అని ఆనాడు ఈనాడు దినపత్రిక ప్రచురించిందని.. ఈనాడు టీడీపీ ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్ల గురించి జాతీయ పత్రికలన్నీ కథనాలను ప్రచురించాయని లోకేశ్ ట్వీట్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పేదవారికి తక్కువ ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్న క్యాంటీన్లను’ ప్రారంభించింది. దీనిలో రూ. 73 విలువైన ఆహారాన్ని కేవలం రూ.15కే అందిస్తారు.. తొలి విడతలో 25 మున్సిపాలిటీల్లో 60 క్యాంటీన్లను ఏర్పాటు చేయగా.. త్వరలో  మరో 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్షయపాత్ర సంస్థకు కేటరింగ్ బాధ్యతలు అప్పగించారు.

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader