నారా లోకేష్‌కు కోవిడ్: హోం ఐసోలేషన్ లో టీడీపీ నేత
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని లోకేస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
అమరావతి: Tdp జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రిNara Lokesh కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన home quarantineలో ఉన్నారు. తనకు Corona సోకిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా లోకేష్ వెల్లడించారు.
ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని లోకేష్ కోరారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం నాడు రాష్ట్రంలో 4570 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18 నుండి రాత్రి కర్ఫ్యూను అమలు చేయనుంది.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని సీఎం జగన్ ను లోకేష్ కోరారు. ఏపీలో కరోనాకేసులు పెరుగుతున్నందున విద్యా సంస్థలకు Sankranti సెలవులను పొడిగించాలని ఆ లేఖలో కోరారు. ''ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. మన పొరుగు రాష్ట్రాలైన Telangana, Tamilnadu , kerala కూడా రెండు వారాల పాటు స్కూల్స్ కి holidays ప్రకటించాయి. కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో వుంచుకుని తక్షణమే స్కూల్స్ కి సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చెయ్యాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.
మరోవైపు కరోనా పరిస్థితులపై ఏపీ సీఎం Ys Jagan సోమవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో కోవిడ్ విస్తరణ పరిస్థితులను అధికారులు వివరించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు.
ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకోసం పడకల సంఖ్యను కూడా సిద్ధం చేశామని అధికారులు తెలిపారు.రాష్ట్రంలో 53,184 పడకలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కోవిడ్ కేసుల్లో ఆస్పత్రుల్లో దాదాపు 27వేల యాక్టివ్ కేసుల్లో కేవలం 1100 మంది మాత్రమే ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారని అధికారులు వివరించారు. ఇందులో ఆక్సిజన్ అవసరమైన వారి సంఖ్య సుమారు 600 మంది మాత్రమేనని అధికారులు తెలిపారు.
ఈమేరకు వైద్య పరంగా అవసరాలను గుర్తించాలని ఆ మేరకు ఆక్సిజన్‌ను, మందులను సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్‌కేర్ సెంటర్‌ను గుర్తించినట్టుగా అధికారులు చెప్పారు. సుమారు 28 వేల బెడ్లను సిద్ధంచేశామని అధికారులు తెలిపారు.
టెలిమెడిసిన్ ద్వారా కాల్‌చేసిన వారికి వైద్యం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను కోరారు.రెండో డోస్ వ్యాక్సినేషన్‌లో మిగతా జిల్లాలతో పోలిస్తే కాస్త దిగువన ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు.
.తూర్పుగోదావరి, గుంటూరు, వైయస్సార్‌కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్‌పైన ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.కోవిడ్ లక్షణాలు లేనివారికి ఎలాంటి పరీక్షలు చేయొద్దని ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్న విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.