అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి నారా లోకేష్. దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్‌లూ ఉంటాయి జ‌గ‌న్. దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించ‌లేదు. రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే! అది ఫుల్‌స్టాప్ అనుకున్నారు మీరు అంటూ పోస్ట్ చేశారు. 

కామా పెడితే దాన్ని ఫుల్ స్టాప్ అనుకున్న జగన్ ఈ గ్యాప్‌లోనే గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాల‌నుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు. దేవుడు కామా త‌రువాత మ‌ళ్లీ  స్క్రిప్ట్ రాయ‌డం మొద‌లుపెట్టాడని చెప్పుకొచ్చారు. 

మీరు అవినీతి అన్న ప‌ట్టిసీమ మోటార్లు మీతోనే ఆన్ చేయించాడని అడ్డ‌గోల‌న్న పోల‌వ‌రం అంచ‌నాలను య‌థాత‌థంగా కేంద్రంతో ఓకే చేయించాడని చెప్పుకొచ్చారు. టీడీపీ హ‌యాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమం అని మీరంటే అవి ముట్టుకుంటే షాక్ కొడ‌తాయ‌ని కేంద్రంతో లేఖ రాయించాడని పోస్ట్ చేశారు. 

దేవుడి స్కిప్ట్ లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయి. భ్ర‌మ‌రావ‌తి అన్న మీ భ్ర‌మ‌లు తొల‌గించుకునేందుకు దేవుడే ఓ ఛాన్సిచ్చాడు. సెక్ర‌టేరియ‌ట్‌లో సీఎం సీటులో కూర్చున్న‌ప్పుడైనా, అసెంబ్లీలో అడుగుపెట్టిన‌ప్పుడైనా చంద్ర‌బాబుకి మ‌న‌సులో కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకో అని స్క్రిప్ట్ లో మ‌ళ్లీ కామా పెట్టాడంటూ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. 

 

 

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీ ఆధ్వర్యంలో సహస్రచండీయాగం: హాజరుకానున్న సీఎం జగన్