ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. గురువారం నాలుగో రోజు సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిండు సభ సాక్షిగా తన మూర్ఖత్వాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. 

పాలనను గాలికొదిలి తన భజన చేయించుకుంటూ వికృతానందం పొందుతున్నారని వ్యగ్యాస్త్రం సంధించారు. ‘‘మూర్ఖత్వం మూర్తీభవించిన సీఎం జగన్.. పాలన గాలికొదిలి కోట్లాది రూపాయల ప్రజాధనంతో తన భజన చేయించుకుంటూ వికృతానందం ఎలా పొందుతున్నారో చూడండి’’ అంటూ ఓ వీడియోను ట్వీట్టర్‌లో అప్ లోడ్ చేశారు. 

నిన్న జగన్ అసెంబ్లీలో చంద్రబాబు మీద చూపించిన వీడియోకు కౌంటర్ గా ఈ వీడియోను నారా లోకేష్ ట్వీట్ చేశాడు. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు ఏం చేశాడో చూడండి అంటూ జయము జయము చంద్రబాబు అనే వీడియోను నిన్న అసెంబ్లీలో ప్రదర్శించిన సంగతి తెలిసిందే.